రియల్టీలోకి రాని బోయపాటి

Boyapati

రామ్ హీరోగా బోయపాటి తీసిన “స్కంద” సెప్టెంబర్ 28న విడుదలైంది. నేటితో పది రోజుల రన్. ఈపాటికే దాని ఫలితం ఏంటో అందరికీ తెలుసు. సినిమాకి విమర్శకులు రాసిన రివ్యూలు, ఇచ్చిన రేటింగ్ లు చూసిన తర్వాత, జనం నిర్ద్వంద్వంగా తిరస్కరించిన తర్వాత కూడా తాను మంచి సినిమా తీశానని అని బోయపాటి ఇంకా నమ్ముతున్నారు. లేదూ అలా చెప్పుకుంటున్నారు.

“స్కంద” విడుదల తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో బోయపాటి మాటలు వింటే ఈ సినిమా పోయింది అన్న వాస్తవాన్ని ఆయన ఇంకా ఒప్పుకోవడం లేదు అనిపిస్తోంది. ఇంకా రియల్టీలోకి రాలేదు.

“నా సినిమా బాగా లేకపోతే డాష్ లా ఉంది అని నిర్మొహమాటంగా చెప్పే వాళ్ళు ఉన్నారు. వాళ్ళే ఫోన్ చేసి సినిమాని బాగా తీశావు భయ్యా అని చెప్పారు,” అంటూ తన సినిమా ఆడుతుంది, బాగుంది అన్నట్లుగా మాట్లాడారు.

బోయపాటి బ్రహ్మాండమైన హిట్స్ చాలా చూశారు. ఫ్లాపులూ చూశారు. మరి ఇంకా ఫ్లాప్ ని ఫ్లాప్ అని ఒప్పుకునేందుకు ఎందుకు వెనకాడుతున్నారో. బోయపాటి ఇక తన సినిమాల్లో లాజిక్ లు లేని వైనం గురించి ఎప్పట్లాగే తాను కన్విన్స్ అయి, ఎదుటివాళ్ళని కన్వీన్స్ చేశాననుకునే సమాధానం ఇచ్చారు.

Advertisement
 

More

Related Stories