నైట్ పెగ్ ఉంటే బ్రహ్మానందమే!

ఏక్ పెగ్ లే మామా! అనేది బాలయ్య పాలసీ. ‘భీష్మ’ సినిమాలో సంపత్ పాత్ర చెప్పినట్లు… “ప్రతి రోజు ఉదయం ఎగ్గు, రాత్రి పెగ్గు, లెగ్గు (అదేనండి కోడి లెగ్ పీస్)” పద్దతిలో ఉంటుంది మన అఖండ దినచర్య.

ఏ విషయాన్ని భోళాగా చెప్పే బాలయ్య ఇప్పుడు పదే పదే అదే చెప్తున్నారు ‘అన్ స్టాపబుల్’ అనే తన టాక్ షోలో.

కొన్ని వారాల గ్యాప్ తర్వాత మూడో ఎపిసోడ్ పూర్తి చేశారు. భుజానికి సర్జరీ జరగడం వల్ల మధ్యలో గ్యాప్ వచ్చింది. ‘ప్రతివారం రావడానికి నేను టీవీ సీరియల్ కాదు…” అంటూ బాలయ్య ఒక పంచ్ డైలాగ్ విసిరి మూడో ఎపిసోడ్ మొదలెట్టారు. మంచి జోష్ లో షోని కండక్ట్ చేస్తున్నారు ఆయన. ఈ వారం బ్రహ్మానందం, దర్శకుడు అనిల్ రావిపూడి గెస్టులుగా విచ్చేశారు.

బ్రహ్మీని ఒక రేంజులో బాలయ్య ఆటపట్టించినట్లు కనిపిస్తోంది. ఒక పెక్ (ఆప్యాయంగా చెంపపై పెట్టె ముద్దు), ఒక పెగ్ ఇస్తాను అని బాలయ్య అంటే… “అవి ఉంటే చాలు ఇంకే” అని బ్రమ్మీ గడుసుగా సమాధానం ఇచ్చారు.

పెగ్ ప్రస్తావన ఎదో రూపంలో తీసుకొస్తున్నారు బాలయ్య. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నది కూడా ఒక ఆల్కహాల్ బ్రాండ్. ‘మ్యాన్షన్ హౌజ్’ అనే బ్రాండ్ ఈ షోకి మెయిన్ స్పాన్సర్.

Advertisement
 

More

Related Stories