నాకు కొడుకు లేడు: విజయశాంతి

Vijayashanti


విజయశాంతి కొడుకు త్వరలోనే హీరోగా అడుగుపెడుతాడు అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఐతే, ఆమెకి పిల్లలు లేరు అన్న విషయం అందరికీ తెలుసు. మరి ఈ కొడుకు ఎవరు? అతను హీరో కావడం ఏంటి?

విజయశాంతి చాలా ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నారు. శ్రీనివాస ప్రసాద్ అనే వ్యక్తిని ఆమె పెళ్లాడారు. కాకపోతే పెళ్లైన విషయాన్ని ఆమె చాలా కాలం దాచిపెట్టిన మాట నిజమే. పెళ్లి తర్వాత కూడా ఆమె కుమారి విజయశాంతిగానే చలామణి అయ్యారు. ఇప్పుడు ఆమె రాజకీయనాయకురాలు. ఇప్పుడు ఆ విషయంలో గోప్యత పనికిరాదు.

ఐతే, తనకి కొడుకు ఉన్నాడు అన్న వార్తల్లో నిజం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. సమాజ సేవ చెయ్యాలనే దృక్పథంతోనే ఆమె లేటుగా పెళ్లి చేసుకున్నారు. ఇక పిల్లలు వద్దు అనుకున్నది కూడా అందుకేనట. తెలంగాణ బీజేపీ నాయకురాలిగా ఉన్న విజయశాంతి ఆ మధ్య మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటించారు. ఆ తర్వాత ఆమె మళ్ళీ ఏ చిత్రం ఒప్పుకోలేదు.

ఒకప్పుడు లేడి అమితాబ్ అన్న పేరు తెచ్చుకున్న విజయశాంతి హీరోయిన్ గా వైభవం చూశారు. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో ఫిమేల్ మెగాస్టార్ అనిపించుకున్నారు.

Advertisement
 

More

Related Stories