మళ్ళీ పోస్టులు పెడుతున్న కళ్యాణ్


శ్రీజ, ఆమె భర్త కళ్యాణ్ దేవ్ విడిపోయారని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకు వాళ్లిద్దరూ స్పందించలేదు. ఐతే, శ్రీజ తన పేరు నుంచి కళ్యాణ్ అని తొలగించింది. కళ్యాణ్ ని ఇంస్టాగ్రామ్ లో ఫాలో కావడం లేదు. మీడియాలో వారి గురించి వార్తలు వచ్చినా ఖండించడం లేదు అంటేనే ఏంటో అర్థం అవుతుంది.

Advertisement

ఐతే ఈ గొడవ జరిగిన ఐదు వారాల టైంలో కళ్యాణ్ దేవ్ సైలెంట్ గా ఉన్నాడు. సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు పెట్టలేదు. తన సినిమా ‘సూపర్ మచ్చి’ సంక్రాంతికి విడులైంది. దాని గురించి కూడా ఒక్క పోస్ట్ పెట్టలేదు. ఆరు వారాల తర్వాత ఇప్పుడు మళ్ళీ వరుసగా ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు పెడుతున్నాడు.

నువ్వు ఇది చెయ్యలేవు అని అంటే పట్టించుకోకు… నీ పని నువ్వు చెయ్యి అని కొటేషన్ కూడా పెట్టాడు. ప్రస్తుతం తాను చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉన్నట్లు హింట్స్ ఇస్తున్నాడు.

కళ్యాణ్ దేవ్ నటించిన ‘కిన్నెరసాని’ అనే మరో సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. మరి, ఆ సినిమాని ప్రమోట్ చేస్తాడా అనేది చూడాలి.

Advertisement
 

More

Related Stories