బక్కచిక్కి…ట్రోలింగ్ కి చిక్కి!

Mehreen Pirzada

హీరోయిన్లు స్లిమ్ గా ఉంటేనే అందం. ఐతే, స్లిమ్ గా ఉండడం వేరు, బక్కచిక్కి కార్డు బోర్డుల సన్నగా మారడం వేరు. ఒకప్పుడు సైజు జీరో అందాలకు క్రేజ్ ఉండేది కానీ ఇప్పుడు లేదు. అందుకే, మెహ్రీన్ ఇప్పుడు ట్రోలింగ్ కి గురైంది.

ఈ అమ్మడు కొంతకాలంగా సన్నబడుతూ వస్తోంది. తాజాగా ఆమె తన కొత్త ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో అప్డేట్ చేసింది. ఆమె మొత్తంగా బక్కపలచగా మారింది. అంతేకాదు, సడెన్ గా తగ్గితే శరీరంపై ముడతలు ఉండిపోతాయి. అలా ఆమె శరీరంపై ఆ ఛాయలు కూడా ఉన్నాయి. దాంతో, ఆమె ట్రోలింగ్ కి గురవుతోంది.

సినిమా అవకాశాలు అవే వస్తాయిలే, ముందు కొంచెం తిను అంటూ జనం ఆమెకి సలహా ఇస్తున్నారు.

“చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు. కానీ నువ్వు అలా లేవు. కొంచెం బరువు పెరుగు మెహ్రీన్” అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

మెహ్రీన్ వ్యక్తిగత జీవితంలో ఎదురుదెబ్బలు చూసింది. ఆమె ఎంగేజ్ మెంట్ రద్దు అయింది. దాంతో, కొన్నాళ్ళూ ఆ బాధలో ఉంది. ఇక సినిమాల్లో అవకాశాలు తగ్గాయి. దాంతో, తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునేందుకు ఇలా మారినట్లు కనిపిస్తోంది.

Mehreen Pirzada

గతేడాది “ఎఫ్ 3” తర్వాత ఆమె నుంచి మరో సినిమా విడుదల కాలేదు. “స్పార్క్” అనే సినిమా ఒప్పుకొంది. కానీ, దాని అతీగతీ లేదు. ప్రస్తుతం ఒక కన్నడ చిత్రంలో నటిస్తోంది.

Advertisement
 

More

Related Stories