హిందీ జెర్సీ షూటింగ్ పూర్తి

అర్జున్ రెడ్డి సినిమా హిందీలో కబీర్ సింగ్ గా తీస్తే అందులో అద్భుతంగా నటించాడు షాహిద్ కపూర్. ఆ సినిమా 250 కోట్లు కొల్లగొట్టింది. షాహిద్ కపూర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. అందుకే, మళ్ళీ తెలుగు సినిమానే రీమేక్ చేస్తున్నాడు. నాని హీరోగా నటించిన “జెర్సీ” సినిమాని షాహీద్ కపూర్ రీమేక్ చేస్తున్నాడు.

Advertisement

తెలుగులో తీసిన గౌతమ్ తిన్ననూరి హిందీ వర్షన్ కి కూడా దర్శకుడు. ఇక, ఈ సినిమాతో దిల్ రాజు హిందీలో ఇంట్రడ్యూస్ అవుతున్నారు నిర్మాతగా.

కరోనా టైంలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవడం. 47 రోజుల పాటు కోవిడ్ కాలంలో షూటింగ్ చేసి… గుమ్మడికాయ కొట్టామని అంటున్నాడు షాహిద్ కపూర్. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ సినిమాని కంప్లీట్ చెయ్యడమంటే ఒక మిరాకిల్ అనే చెప్పాలి అని అంటున్నాడు

Advertisement
 

More

Related Stories