‘MAA’కి పోటీగా ‘ATMAA’!

Vishnu and Prakash Raj


‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ – MAA) గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రకాష్ రాజ్ ఇప్పటికే ‘మా’కి రాజీనామా చేశారు. నాగబాబు కూడా రిజైన్ చేశారు. ‘మా’కి పోటీగా ఇప్పుడు ప్రకాష్ రాజ్ వర్గం కొత్త సంఘం పెట్టనున్నారు. ‘MAA’కి పోటీగా ‘ATMAA’ రానుంది.

ఆత్మ (All Telugu Movie Artists Association – ATMAA) పేరుతో ఈ సంఘం ఉంటుంది. ఇందులో కులాల కంపు, ప్రాంతీయ విబేధాలు ఏవీ లేని ఒక సంఘంగా ఉంటుందట. ఇది ప్రకాష్ రాజ్ ఆలోచన. మెగాస్టార్ చిరంజీవి వర్గం అంతా ఏకమైంది.

మంచు విష్ణుని కొన్ని ‘శక్తులు’ వెనుకుండి నడిపించాయని ప్రకాష్ రాజ్ వర్గం బలంగా నమ్ముతోంది. ఇలాగే ఉంటే ఇష్టారాజ్యం అవుతుంది అని వారు ఫీల్ అవుతున్నారట. అనసూయ వంటి వారు కూడా ముందు గెలిచారని, ఆ తర్వాత ఓడిపోయారని రిజల్ట్ రావడంతో మా ఎన్నికల ఫలితాలపై అనుమానాలు ఉన్నాయని అంటున్నారు.

మా ఎన్నికల గొడవ మూడు నెలల క్రితం మొదలైంది. ఎన్నికలు ముగిసిన తర్వాత మరో కొత్త దుమారం షురూ అయింది. ఇది మరికొంతకాలం కొనసాగేలా ఉంది.

 

More

Related Stories