అందుకే పెళ్లి కావట్లేదు!

Kangana


కంగన రనౌత్ పేచీకోరు. అందరితో గొడవలు పెట్టుకుంటుంది. ఆమెకి కొంచెం తలతిక్క.

ఇలాంటి అభిప్రాయం జనంలో ఉంది. మీడియాలో కూడా అలాంటి వార్తలే వస్తాయి. తన గురించి ఇలాంటి ఇమేజ్ క్రియేట్ చెయ్యడం వల్లే తనకి ఇంకా పెళ్లి కాలేదేమో అంటోంది ఈ భామ. “మీరు ఎందుకు అందరితో గొడవలు పెట్టుకుంటారు?” అని అడిగితే ఆమె సమాధానం ఇచ్చింది. మీడియా ఇలాంటి ప్రశ్నలు అడిగి జనం దృష్టిలో తనని బ్యాడ్ చేశారని అంటోంది.

“35 ఏళ్ళు వచ్చినా తనకి ఇంకా పెళ్లి సంబంధాలు రాకపోవడానికి ఇదే కారణం కావొచ్చు,” అని చెప్తోంది. ఇంతకీ, ఆమెకి పెళ్లి సంబంధాలు ఎందుకు? ఒక హీరోయిన్ కి పెళ్లి చూపులు, సంబంధాలు చూడడం ఉంటుందా? కంగన ఇలాంటి కబుర్లు చెప్పడంలో దిట్ట. తాను పేచీకోరు కాదని చెప్పేందుకే ఇలాంటి సమాధానం ఇచ్చింది ఈ సుందరి.

కంగన నటించిన ఒక కొత్త చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది. ఈ సినిమాకి ఎంత ఓపెనింగ్ వస్తుందో చూద్దామని మొత్తం బాలీవుడ్ నిరీక్షిస్తోంది. ఎందుకంటే, బాలీవుడ్ హీరోల పని అయిపోయిందని, వాళ్ళ సినిమాలకు ఓపెనింగ్ రావని ఆమె విమర్శలు చేస్తోంది. మరి ఈ అమ్మడు ఎంత ఓపెనింగ్ రాబడుతుందో?

 

More

Related Stories