బిగ్ బీ ఇంట్లోకి షిఫ్టయిన కృతి


ముంబైలో ఇల్లు కొనుక్కోవడం మాటలు కాదు. కోట్లు కోట్లు కావాలి. మంచి ప్రాంతంలో 3 బెడ్ రూమ్ అపార్ట్మెంట్ కొనాలంటే కనీసం 10 కోట్లు వెచ్చించాల్సిందే. అందుకే, పేరున్న హీరో, హీరోయిన్లు కూడా అపార్ట్ మెంట్లను రెంట్ కి తీసుకుంటారు. లేటెస్ట్ గా హీరోయిన్ కృతి సనన్ కూడా కొత్త ఇంట్లోకి మారింది. ఇది అమితాబ్ బచ్చన్ కి చెందిన అపార్ట్ మెంట్.

అమితాబ్ బచ్చన్ కి ముంబైలో చాలా అపార్ట్ మెంట్ లున్నాయి. అవన్నీ రెంట్ కి ఇచ్చారు. కృతి ఏరికోరి అమితాబ్ కి చెందిన ఒక అపార్ట్మెంట్ ని రెంట్ కి తీసుకొని ఆ ఇంట్లోకి మారింది.

ఇటీవలే “మిమి” సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకొంది. ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘ఆదిపురుష్’ నటిస్తోంది. ఆమె బాగానే సంపాదిస్తోంది. ఐతే, ఇంకా సొంత ఇల్లు కొనలేదు. ఇటీవల ఆమె 2 కోట్లు పెట్టి ఒక కారు కొనుక్కొంది. ఇక నెక్స్ట్ టార్గెట్ ఇల్లే.

Advertisement
 

More

Related Stories