కన్ఫ్యూజన్లో ఎన్టీఆర్ సినిమాలు!


‘ఆర్ ఆర్ ఆర్’ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమాని ప్లాన్ చేశారు. దాంతో పాటు, ప్రశాంత్ నీల్ సినిమా కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ప్రొమోషన్ల టైంలో ఈ రెండు సినిమాల గురించే ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడారు. కానీ, ఇవి రెండు కాకుండా ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు చెప్పిన కథకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్.

ఐతే, ఇప్పుడు కొరటాల శివ సినిమా కన్నా నీల్ సినిమా కోసం అభిమానులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే, ‘ఆచార్య’తో కొరటాల గ్రాఫ్ తగ్గింది. ‘కేజీఎఫ్ 2’తో ప్రశాంత్ నీల్ గ్రాఫ్ ఆకాశాన్ని అంటింది. కానీ, ‘కేజీఎఫ్ 2’ నిర్మాత మాత్రం ఒక కొత్త విషయాన్ని చెప్పి ఎన్టీఆర్ అభిమానులను టెన్సన్ లోకి నెట్టారని చెప్పాలి.

ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ‘సలార్’ తీస్తున్నారు. ఇది పూర్తి అయ్యాక ఎన్టీఆర్ తో మూవీ మొదలుపెడుతారనేది ఇప్పటివరకు అంచనా. “సలార్ షూటింగ్ అక్టోబర్ నాటికి పూర్తి అవుతుంది. ఆ తర్వాత కేజీఎఫ్ 3 లాంచ్ చేస్తాం. 2024లో కేజీఎఫ్ 3 విడుదల చేసేలా షూటింగ్ మొదలు పెడుతామని,” నిర్మాత విజయ్ కే చెప్పారు. ఆయన ‘కేజీఎఫ్ 2’ నిర్మాత. అలాగే, ‘సలార్’ ఆయనే నిర్మిస్తున్నారు. ‘కేజీఎఫ్ 3’ కూడా ఆయనే నిర్మాత.

ఇదే నీల్ ఆలోచన అయితే ఎన్టీఆర్ సినిమా ఇంకా చాలా ఆలస్యం అవుతుంది. ఈ సినిమా కన్నా ముందు కొరటాలతో మూవీ, బుచ్చిబాబుతో మూవీ అంటే… అభిమానులకు ఊపు రాదు. అందుకే, అభిమానులు తెగ కన్ఫ్యూజ్ అవుతున్నారు.

 

More

Related Stories