సమంత కేసు సోమవారానికి వాయిదా

సమంత వేసిన పరువు నష్ట దావా కేసు విచారణ శుక్రవారం కూడా కొనసాగింది. ఐతే, పూర్తి వాదనలు పూర్తి అయ్యాకే తీర్పు ఇస్తామని కూకట్‌పల్లి కోర్టు జడ్జి తెలిపారు. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించారు. పూర్తి వాదనలు విన్న తర్వాతే తీర్పును ప్రకటిస్తామని, తదుపరి విచారణను అక్టోబర్‌ 25కు వాయిదా వేశారు. అంటే సోమవారం కేసు టేకప్ కి వస్తుంది.

భర్త నాగ చైతన్యతో సమంత విడిపోవడానికి కారణాలు ఇవే అంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, అలాగే వెంకట్ రావు అనే డాక్టర్ శ్రుతి మించి వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె వారిపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు.

సమంత పరువు నష్టం కేసులో ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి. ఈ తీర్పు యూట్యూబ్ ఛానెల్స్ కంటెంట్ ని డిసైడ్ చేస్తుంది. కోర్టు తీర్పు సమంతకి అనుకూలంగా రాకపోతే ఇక యూట్యూబ్ ఛానెల్స్ ఇష్టానుసారంగా రెచ్చిపోతాయి. మిగతా సెలబ్రిటీలపై కూడా ఇలాంటి కథనాలు వస్తాయి.

సమంత మాత్రం ఈ కేసులో పట్టుదలగా ఉన్నారు. ఆమె తరపు న్యాయవాది బలంగా వాదించలేకపోయారు అని అంటున్నారు.

 

More

Related Stories