సీతామనోహర శ్రీరాఘవ చిత్రం షురూ

Virata Raj

అలనాటి హీరో హరనాథ్ మనవడు విరాట్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. ‘సీతామనోహర శ్రీరాఘవ’ పేరుతో రూపొందుతోన్న ఈ మూవీ ఈ రోజు షురూ అయింది. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో మూవీ లాంచ్ జరిగింది. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచాన్ చేయగా, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి క్లాప్ నిచ్చారు. యువ హీరో ఆకాష్ పూరి దర్శకత్వం వహించారు.

దుర్గా శ్రీ వత్సస.కె. దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నవంబర్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని అన్నారు నిర్మాత టి సుధాకర్. కెజీఎఫ్ ఫేమ్ రవి బస్రుర్ ఈ సినిమాకి సంగీతం ఇస్తున్నారు.

రేవ హీరోయిన్ గా పరిచయం అవుతోంది.

Advertisement
 

More

Related Stories