అన్నత్తే టీజర్ వచ్చేసింది!

Rajinikanth

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తమిళ చిత్రం ‘అన్నత్థే’ ఈ దీపావళికి విడుదల కానుంది. తెలుగులో ‘పెద్దన్న’ అనే పేరుని పరిశీలిస్తున్నారు. నాగ చైతన్యతో ‘లవ్ స్టోరీ’ నిర్మించిన నారాయణ దాస్ నారంగ్ ఈ సినిమా తెలుగు హక్కులు కొన్నారు. త్వరలోనే తెలుగు పోస్టర్ తో ప్రొమోషన్ మొదలుపెడతారు.

ఇక తమిళంలో ఈ సినిమా మొదటి టీజర్ తాజాగా విడుదలైంది.

ఇక తమిళంలో ఈ సినిమా మొదటి టీజర్ తాజాగా విడుదలైంది. తన ఊరిలో అన్యాయం చేసిన వారి పని పట్టే అన్నగా రజినీకాంత్ ఈ సినిమాలో కనిపిస్తారు. ఈ టీజర్లో రజినీకాంత్ ని యాక్షన్ మోడ్ లో చూపించారు. రెండు నిమిషాల పాటు సాగే ఈ టీజర్ లో రజినీకాంత్ స్టయిలిష్ గా కనిపిస్తున్నారు. ఊరి పెద్ద అవతారంలో డిగ్నిఫైడ్ గానూ ఉన్నారు.

రజినీకాంత్ సరసన నయనతార నటిస్తోంది. ఆయనకి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ కనిపించనుంది.

 

More

Related Stories