ఆ అయిదుగురికే సాధ్యం!


ప్రభాస్ పారితోషికం ఎంతో తెలుసా? అక్షరాలా వంద కోట్లు. అవును … మీరు చదివింది నిజమే 100 కోట్ల రూపాయలు. తెలుగులోనే కాదు మొత్తం సౌత్ ఇండియాలో అంత పారితోషికం తీసుకుంటున్న హీరో మరొకరు లేరు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్… 50 నుంచి 30 కోట్లు తీసుకుంటున్నారు. ఇది మన అగ్ర కథానాయకుల సంపాదన.

మరి హీరోయిన్లలో అత్యధికంగా అందుకుంటున్నది ఎవరు? సమంత, నయనతార, అనుష్క, పూజ హెగ్డే, తమన్న….ఇదే ఆ లిస్ట్.

నయనతార

దక్షిణాది హీరోయిన్లలో నెంబర్ వన్… నయనతార. ఆమె అక్షరాలా 4 నుంచి 5 కోట్ల రూపాయలు తీసుకుంటోంది. తెలుగులో నటించినా, తమిళంలో చేసినా అంతే అడుగుతుంది. త్వరలోనే ఆమె చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో కనిపించనుంది.

పూజ హెగ్డే

రెండో స్థానం… పూజ హెగ్డే. ఆమె సినిమాకి 2.75 నుంచి 3 కోట్ల వరకు అందుకుంటోంది. ప్రస్తుతం ఆమె చేతిలో అన్ని పెద్ద చిత్రాలే.

సమంత

గుణశేఖర్ తీస్తున్న ‘శాకుంతలం’ సినిమాకి సమంత రెండున్నర కోట్లు తీసుకొంది. ఇటీవలే నాగ చైతన్య నుంచి విడిపోయింది సమంత. ఇప్పుడు మరిన్ని సినిమాలు సైన్ చేసేందుకు రెడీ అయింది. మరి ఎక్కువ చిత్రాలు కావాలని పారితోషికం తగ్గిస్తుందా అన్నది చూడాలి

కీర్తి సురేష్

కీర్తి సురేష్ కూడా అంతే. సినిమాకి రెండు నుంచి రెండున్నర కోట్లు తీసుకుంటోంది. మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’, ‘భోళా శంకర్’ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా నటిస్తోంది.

నుష్క

అనుష్క సినిమాకి రెండు నుంచి రెండున్నర కోట్లు తీసుకుంటుంది. కానీ ఆమె ఇటీవల కొత్తగా ఏ సినిమా సైన్ చెయ్యలేదు.

 

More

Related Stories