Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

The 3rd: ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపిక

TeluguCinema, April 25, 2026April 25, 2026
The 3rd

సీనియర్ జర్నలిస్టు, రచయిత కె.ఎ. మునిసురేష్ పిళ్లె తొలిసారిగా దర్శకత్వం వహిస్తూ రూపొందించిన షార్ట్ ఫిలిం The 3rd న్యూఢిల్లీలో ఏప్రిల్ 30న జరిగే 16వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2026 లో స్క్రీనింగ్ కు ఎంపికైంది. భారత చలనచిత్ర పితామహుడిగా అందరూ కీర్తించే దాదాసాహెబ్ ఫాల్కే జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఏప్రిల్ 30న ఢిల్లీలో ఈ ఫెస్టివల్ జరుగుతుంటుంది. ఈ ఏడాది చిత్రోత్సవానికి తెలుగులో సురేష్ పిళ్లె రూపొందించిన ఈ షార్ట్ ఫిలిం ఎంపికైంది.

ర్యాంకుల ఒత్తిడితో ఇంటర్మీడియట్ విద్యార్థుల ప్రాణాలను బలితీసుకునే కార్పొరేట్ జూనియర్ కాలేజీల దుర్మార్గాలు, చదువుల్లో వెనుకబడిన పిల్లలను సూటిపోటిమాటలతో తూట్లు పొడిచే లెక్చరర్ల వైఖరి కథాంశంగా ఈ 40 నిమిషాల నిడివిగల షార్ట్ ఫిలిం రూపొందించినట్లు సురేష్ పిళ్లె చెప్పారు.

సృష్టిలో ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది అని న్యూటన్స్ థర్డ్ లా చెబుతుంది. మీరు కష్టపడి చదవకపోతే దానికి ప్రతిచర్యగా మీ జీవితాలు నాశనమైపోతాయి అంటూ.. ఫిజిక్స్ లెక్చరర్ పిల్లల్ని టార్చర్ పెడుతుంటాడు. జీవితంలో ప్రతి విషయానికీ న్యూటన్స్ థర్డ్ లా నే ఆపాదించి మాట్లాడుతుంటాడు. అలాంటి లెక్చరర్ చేసిన పాపానికి, న్యూటన్స్ థర్డ్ లా చెప్పినట్టుగానే, ఎదురైన సమానమైన ప్రతిచర్య ఏమిటన్నదే ఈ సినిమా అని సురేష్ పిళ్లె వివరించారు.

ఆదర్శిని చిత్రాలు బ్యానర్ పై భారతమ్మ నిర్మాతగా రూపొందిన చిత్రానికి ఆదర్శిని భారతీకృష్ణ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ చేశారు. ప్రధానపాత్రల్లో ఆదర్శిని శ్రీ, ఒబ్బు ప్రసాద్, సూరావజ్ఝుల రాము, పెమ్మరాజు విజయరామచంద్ర, డా.కిరణ్ కుమార్, బాలమురళి తదితరులు నటించారు. సునో యాప్ ద్వారా ఏఐ సహకారంతో స్వరపరిచిన రెండు పాటలకు సాహిత్యాన్ని మునిసురేష్ పిళ్లెనే అందించారు. పదిమంది నటులు ఇందులో తొలిసారిగా నటించారు. ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ కు ఎంపికైన ఈ చిత్రానికి కథ మాటలు పాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం బాధ్యతలను కె.ఎ. మునిసురేష్ పిళ్లె నిర్వహించారు.

40 నిమిషాల నిడివి గల The 3rd షార్ట్ ఫిలింను ఈ లింక్ ద్వారా చూడవచ్చు

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Nayanthara and her husband Vignesh Shivan in Venice
    Nayanthara: వెనిస్ లో వెడ్డింగ్ డే
  • Thaman
    దేవిశ్రీ ప్రసాద్ పై Thaman పంచ్!
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ‘నాకు సౌత్ సినిమానే గొప్ప’
  • Mumait Khan
    Mumait Khan బుర్రలో టైటానియం
  • Nag Ashwin
    సింగీతంతో ప్రయాణం అదృష్టం: Nag Ashwin
  • Sai Pallavi
    పోలీసుగా మారనున్నSai Pallavi
  • Dulquer Salmaan in Aakasam Lo Oka Tara
    Dulquer Salmaan: తెలుగు షూటింగ్ ల జోరు
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: అలాంటివి పట్టించుకోను!
  • Eesha Rebba
    Eesha Rebba: స్పెషల్ కంటెంట్ ఇస్తుందంట
  • Allu Arjun: AA23 సినిమా ఆగిపోలేదు
  • Aamir Khan wit Gauri Spratt
    Aamir Khan: జులై 5న మూడో పెళ్లి!
  • GV Prakash Kumar
    తెలుగులో బిజీ అవుతోన్న GV Prakash Kumar
  • Nani
    Nani: ఆ వార్త తప్పు అని వివరణ
  • Sushmita Sen
    Sushmita Sen తన డబ్బులు తీసుకోలేదంటున్న లలిత్
  • Gunasekhar
    హీరోల కోసం కథలు రాయొద్దు : Gunasekhar

Recent News

  • Nayanthara: వెనిస్ లో వెడ్డింగ్ డే
  • Sing Geetham: ఒకరోజు ఆలస్యంగా విడుదల
  • Allu Arjun, Ram Charan మధ్య గ్యాప్ లేదింక!
  • 30 ఏళ్ల తర్వాత కేసు గెలిచిన Sukanya
  • Kangana Ranaut: పెద్దిపై ‘క్వీన్’ కామెంట్స్!
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes