రాశి ఖన్నా ఆధ్యాత్మిక జీవన విధానం అలవర్చుకుంటోంది. ఆమె ఇప్పుడు ఓషో పుస్తకాలు చదువుతోంది. ఓషో ఒకప్పుడు భారతదేశంలో పేరొందిన ఆధ్యాత్మిక గురువు. విదేశాల్లో ఆయనకి ఇంకా ఎక్కువ క్రేజ్ ఉండేది. ఆయన జీవితం గురించి చెప్పిన అనేక ప్రసంగాలు పుస్తకాలుగా వచ్చాయి. వాటికి ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది.
ప్రస్తుతం రాశి ఖన్నా వాటిని చదువుతోంది. “ఓషో ఎలా బతకాలో నాకు నేర్పలేదు. నాకు ఇంతకుముందే తెలిసిన దాన్ని మళ్ళీ గుర్తు చేశారు. మర్చిపోకుండా చేశారు.”
“ఓషో పుస్తకాలు మొదటిసారి చదివినప్పుడు ఆయన చెప్పిన నగ్న సత్యాలు మొదట ఇబ్బంది పెట్టాయి. ఆ తర్వాత నన్ను భయాల నుంచి విముక్తి చేశాయి,” అని చెప్పుకొచ్చింది ఈ భామ.
తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. ఒకప్పుడు హీరోయిన్ గా బిజీగా ఉన్న ఈ భామ ఇప్పుడు కేరీర్ లో వెనుకబడింది. సిద్ధూ జొన్నలగడ్డతో కలిసి నటిస్తోన్న “తెలుసు కదా” ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.
తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు వంటి సినిమాల్లో నటించిన సుకన్య (Sukanya) ఇప్పుడు వార్తల్లో నిలిచారు. 1990లలో ఆమె పాపులర్…
'పెద్ది' (Peddi) వివాదాన్ని క్యాష్ చేసుకోవాలని చాలామంది హీరోయిన్లు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. డింపుల్ హయాతీ నుంచి మొదలుపెడితే, నిత్యామీనన్ వరకు…
వృత్తిగతంగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ మధ్య ఉన్న పోటీ గురించి అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం…
జగపతి బాబు (Jagapathi Babu) హీరోగా ఎంత సక్సెస్ అయ్యారో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా అంతే…
కంగన రనౌత్ (Kangana Ranaut) మన దేశంలో పనిచేస్తున్న నర్సుల దుస్తులపై విమర్శలు చేసింది. బ్రిటిష్ కాలంలో నర్సులకు ఈ…
ఓవైపు జాన్వి కపూర్ ను అసభ్యంగా చూపించారని, సౌత్ సినిమాలో ఇలాంటివి కామన్ అంటూ ట్రోలింగ్ నడుస్తున్న వేళ.. దక్షిణాది…