కొన్ని సినిమాల విషయంలో నటీనటుల ప్రమేయం లేకుండానే కొంత జరిగిపోతుంది. ఇతరుల బలవంతం వల్ల కొన్ని సినిమాలు, మొహమాటానికి మరికొన్ని సినిమాలు చేయాల్సి ఉంటుంది. ప్రతి నటుడి కెరీర్ లో అలాంటి సినిమాలుంటాయి. నటుడు వేణు తొట్టెంపూడి (Venu Tottempudi) కెరీర్ లో కూడా అలాంటి ఓ సినిమా ఉంది.
రీఎంట్రీ కోసం బాగా ఎదురుచూస్తున్న టైమ్ లో ‘రామారావు ఆన్ డ్యూటీ’ కథ వేణు వద్దకు వచ్చింది. ఆ సినిమా దర్శకుడు శరత్, నిర్మాత వచ్చి కలిసినప్పుడు వేణు పెద్దగా ఆసక్తి చూపించలేదంట. అంతకంటే మంచి పాత్ర దొరికితే రీఎంట్రీ ఇద్దామనుకున్నాడట.
అయితే ఓసారి ఆఫీస్ కు రమ్మని పిలిచారంట. పాత్ర మొత్తం చెప్పి మీరు తప్పకుండా నటించాల్సిందే అంటూ కాస్త గట్టిగా చెప్పారంట. దీంతో మొహమాటానికి పోయి అందులో నటించాడంట వేణు.
రవితేజ హీరోగా నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఫ్లాప్ అయింది. హీరో రవితేజకు, రీఎంట్రీ ఇచ్చిన వేణుకు అది బొత్తిగా కలిసిరాలేదు. ఆ దెబ్బతో మళ్లీ గ్యాప్ తీసుకున్న వేణు, ఇప్పుడు మరో సినిమా రెడీ చేస్తున్నాడు. ఈసారి అన్నీ తానై సినిమా చేస్తున్నాడు.
హీరోయిన్ నయనతార (Nayanthara) లాంగ్ గ్యాప్ తీసుకుంది. కేవలం ఎండ వేడిమి నుంచి తప్పించుకోవడానికి మాత్రమే కాదు, తన వివాహ…
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94వ ఏట తీసిన చిత్రం.. సింగ్ గీతం (Sing Geetham). ఈ సినిమా జూన్…
'పెద్ది' సినిమాను ఇప్పటికే ఎంతోమంది మెచ్చుకున్నారు. అయితే అందరూ ఒకెత్తు, బన్నీ ఒక్కడు ఒకెత్తు. ఓ సెక్షన్ మెగాభిమానులైతే, అల్లు…
తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు వంటి సినిమాల్లో నటించిన సుకన్య (Sukanya) ఇప్పుడు వార్తల్లో నిలిచారు. 1990లలో ఆమె పాపులర్…
'పెద్ది' (Peddi) వివాదాన్ని క్యాష్ చేసుకోవాలని చాలామంది హీరోయిన్లు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. డింపుల్ హయాతీ నుంచి మొదలుపెడితే, నిత్యామీనన్ వరకు…
వృత్తిగతంగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ మధ్య ఉన్న పోటీ గురించి అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం…