నందమూరి బాలకృష్ణ నటించిన “డాకు మహారాజ్” సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. ఈ సినిమా మొదటి ఐదు రోజుల కలెక్షన్లు బాగున్నాయి అని టీం ఆనందంతో సక్సెస్ మీట్ జరిపింది. ఇప్పటికే కొన్నవాళ్ళు అందరూ లాభాల్లోకి వచ్చారు అని నిర్మాత నాగవంశీ, దర్శకుడు బాబీ ఈ వేదికపై ప్రకటించుకున్నారు.
ఇక బాలయ్య తన రికార్డుల గురించి, తన సినిమాల గురించి మాట్లాడుతూ తనవన్నీ అన్ స్టాపబుల్ (Unstoppable) అని తెలిపారు.
“తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ఇతర దేశస్తులు కూడా మన సినిమాలను చూస్తున్నారు. అలా ఎదిగింది మన తెలుగు సినిమా. నా వరకు చూసుకుంటే, నా రికార్డ్స్ అన్నీ అన్ స్టాపబుల్, నా కలెక్షన్స్ అన్నీ అన్ స్టాపబుల్, నా అవార్డ్స్ అన్నీ అన్ స్టాపబుల్, నా రివార్డ్స్ అన్నీ అన్ స్టాపబుల్,” అని తనదైన శైలిలో చెప్పారు బాలయ్య.
జనవరి 22న అనంతపురంలో విజయోత్సవ పండుగ జరుపుతామని ప్రకటించారు బాలకృష్ణ.
హీరోయిన్ నయనతార (Nayanthara) లాంగ్ గ్యాప్ తీసుకుంది. కేవలం ఎండ వేడిమి నుంచి తప్పించుకోవడానికి మాత్రమే కాదు, తన వివాహ…
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94వ ఏట తీసిన చిత్రం.. సింగ్ గీతం (Sing Geetham). ఈ సినిమా జూన్…
'పెద్ది' సినిమాను ఇప్పటికే ఎంతోమంది మెచ్చుకున్నారు. అయితే అందరూ ఒకెత్తు, బన్నీ ఒక్కడు ఒకెత్తు. ఓ సెక్షన్ మెగాభిమానులైతే, అల్లు…
తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు వంటి సినిమాల్లో నటించిన సుకన్య (Sukanya) ఇప్పుడు వార్తల్లో నిలిచారు. 1990లలో ఆమె పాపులర్…
'పెద్ది' (Peddi) వివాదాన్ని క్యాష్ చేసుకోవాలని చాలామంది హీరోయిన్లు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. డింపుల్ హయాతీ నుంచి మొదలుపెడితే, నిత్యామీనన్ వరకు…
వృత్తిగతంగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ మధ్య ఉన్న పోటీ గురించి అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం…