మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా ప్రొమోషన్ విషయంలో వీక్ గా ఉందని అభిమానులు తెగ ఇదైపోతున్నారు. ఐతే, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఈ నెల 12న ట్రైలర్ రాబోతుంది. ఇక అక్కడినుంచి షురూ హంగామా.
చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన మొదటి మల్టీస్టారర్ మూవీ ఇది. ఇంతకుముందు చిరంజీవి తన కొడుకు చరణ్ సినిమాల్లో గెస్ట్ పాత్రలు పోషించారు. కానీ, ఇద్దరూ ఫుల్ లెంగ్త్ పాత్రల్లో కలిసి నటించడం ఇదే ప్రథమం. అందుకే, అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. కాకపోతే, పాటలు పెద్దగా వైరల్ కాలేదు. ప్రచారం చాలా తక్కువ ఉంది. అందుకే, ఈ సినిమా విడుదల టైంలో హైప్ వస్తుందా అన్న సందేహాలు ఉన్నాయి.
‘ఆచార్య’ సినిమా అనేక అడ్డంకులు ఎదుర్కొంది. దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాని ‘భరత్ అనే సినిమా’ విడుదలైన వెంటనే ప్లాన్ చేశారు. కానీ, కోవిడ్ తో పాటు ఇతర కారణాలు తోడయ్యాయి ఆలస్యం కావడానికి. కొరటాల శివ మూడేళ్లపైనే ఈ చిత్రంపై ఉండాల్సి వచ్చింది. మొత్తానికి ఈ నెలాఖరులో విడుదల కాబోతోంది.
‘ఆచార్య’ సినిమా నుంచి ట్రైలర్ వచ్చిన 10 రోజుల తర్వాత చిరంజీవి, చరణ్ కాంబినేషన్ లో తీసిన ఒక పాటని విడుదల చేస్తారు.
Venkatesh and director Anil Ravipudi have teamed up for the fifth time. The duo is…
Kannada actress Sushmita Shetty has landed her first lead role in Telugu cinema after making…
Singer and voice actor Chinmayi Sripaada has once again spoken out against online harassment, revealing…
Rukmini Vasanth is enjoying a dream run in her career. After landing a string of…
Nagarjuna's landmark 100th film is currently in production. Directed by Tamil filmmaker R. Karthik, the…
Ahead of its worldwide theatrical release, Christopher Nolan's "The Odyssey" has already generated tremendous buzz…