ఆదిపురుష్ – తెలుగు రివ్యూ

రాయాయణం.. మనిషికి మార్గదర్శనం. రాముడు ధర్మనిరతుడు. ఇచ్చిన మాటకు కట్టుబడిన దైవస్వరూపుడు. మనిషికి విలువలు నేర్పేది రామాయణం. మనిషి ఎలా నడుచుకోవాలి, ధర్మ మార్గాన్ని ఎలా అనుసరించాలి, సత్యానికి ఎలా కట్టుబడి ఉండాలో రామాయణం నేర్పిస్తుంది. సీతను అపహరించిన రావణుడి అహంకారాన్ని అణచి, అతడ్ని అంతం చేయడమనేది ఒక భాగం మాత్రమే.

దర్శకుడు ఓం రౌత్ కు ఈ ఒక్క భాగమే నచ్చింది. స్మార్ట్ ఫోన్లు, వీడియో గేమ్స్ కు అలవాటుపడిన నేటితరాన్ని ఆకర్షించాలంటే ఈ భాగాన్ని హైలెట్ చేయడమే కరెక్ట్ అని భావించాడు. ఇంకా చెప్పాలంటే, అతడు రామాయణాన్ని, రాముడి గొప్పదనాన్ని చెప్పాలనుకోలేదు. రావణుడ్ని హతమార్చి సీతను పొందిన వైనాన్ని గ్రాఫికల్ డ్రామాగా మాత్రమే చెప్పాలనుకున్నాడు. అదే పని చేశాడు. ఆదిపురుష్ సెకెండాఫ్ మొత్తాన్ని రామ-రావణ యుద్ధానికే అంకితం చేశాడంటే, డైరక్టర్ ఓం రౌత్ లక్ష్యం ఏంటో అర్థం అవుతుంది. రామనామం జపిద్దామని, రామాయణాన్ని వెండితెరపై చూసి తరిద్దామని అనుకుంటే మాత్రం ఈ “ఆదిపురుషుడు” మిమ్మల్ని నూటికినూరు శాతం నిరాశపరుస్తాడు.

వాల్మీకి రచించిన రామాయణం ఆధారంగా తెరకెక్కింది కాబట్టి కథ గురించి ఇక్కడ చెప్పుకోవడం అనవసరం. అయితే ఆ కథను దర్శకుడు ముందుకు తీసుకెళ్లిన విధానం గురించి మాత్రం కచ్చితంగా చెప్పుకోవాలి. రామాయణాన్ని 3 గంటల్లో చెప్పడం కష్టం, కాబట్టి టైటిల్స్ నుంచే కథను స్టార్ట్ చేశాడు దర్శకుడు. శ్రీరామపట్టాభిషేక ఘట్టం, కైకేయి 2 వరాలు కోరడం, భరతుడు సింహాసనాన్ని అధిష్టించడానికి నిరాకరించడం, లక్ష్మణుడు-సీతతో కలిసి రాముడు అడవి బాటపట్టడం లాంటివన్నీ టైటిల్స్ లోనే చిన్నచిన్న పెయింటింగ్స్ రూపంలో చెప్పేశారు.

రాముడి వనవాసం నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. అక్కడ్నుంచి శూర్పనఖ ముక్కు కోయడం, సీతను రావణాసురుడు అపహరించడం, రాముడు సుగ్రీవుని సహాయం కోరడం, వానరసేన సముద్రంపై సేతువు నిర్మించడం.. ఇలా అన్నీ ఫస్టాఫ్ లోనే చకచకా వచ్చేస్తాయి. ఈ క్రమంలో వచ్చిన బంగారు జింక ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. అయితే రామాయణంపై అవగాహన ఉన్నోళ్లకు మాత్రం సినిమాలో తప్పులు చాలా కనిపిస్తాయి. దీనికి సంబంధించి దర్శకుడు, సినిమా ప్రారంభంలోనే సుదీర్ఘంగా వివరణ ఇచ్చాడు. ఇది వాల్మీకి రామాయణమే కానీ ఇది తన వర్షన్ అని చెప్పాడు. ఇప్పటితరాన్ని ఎట్రాక్ట్ చేయడం కోసం దర్శకుడు సినిమాటిక్ ఫ్రీడమ్ తీసుకున్నాడు తప్పితే, రామాయణాన్ని పూర్తిగా వక్రీకరించలేదు.

సెకెండాఫ్ నుంచి రామ-రావణ యుద్ధమే నడుస్తుంది. ఇంద్రజిత్ మాయకు లక్ష్మణుడు మూర్ఛపోవడం, హనుమంతుడు సంజీవని కోసం పర్వతాన్ని పెకిలించి తీసుకురావడం, విభీషణుడు రాముని శరణు కోరడం లాంటివన్నీ వచ్చేస్తాయి. ఆ తర్వాత భీకర యుద్ధంలో రావణుడ్ని రాముడు హతమార్చడం, ఆ వెంటనే శుభం కార్డు పడడం చకచకా జరిగిపోయాయి.

కథ అందరికీ తెలిసిందే. ఎలా చెప్పాడు అనే అందరూ ఎదురుచూశారు. మోషన్ కేప్చర్ అనే టెక్నాలజీతో ఓం రౌత్ ఈ సినిమా తీసాడు. సినిమాలో నటీనటుల క్లోజప్ షాట్స్ తప్ప మిగతా అంతా గ్రాఫిక్స్ . ఐతే, గ్రాఫిక్స్ క్వాలిటీ మరింతగా ఉండాలనే ఉద్దేశంతో కాబోలు సినిమాని ఎక్కువగా డార్క్ టోన్ లో తీశారు. గ్రాఫిక్స్ కొన్ని బాగున్నాయి, కానీ చాలా చోట్ల బాగాలేవు.

రావణుడి లుక్, లంక సెటప్ పెద్దగా ఆకర్షించవు. రామాయణ ఇతిహాసంలో లంక శోభాయమాణంగా వెలుగుతుంది, ఎక్కడచూసినా హరహర మహాదేవ నినాదం వినిపిస్తుంది. కానీ “ఆదిపురుష్ “లో మాత్రం లంకను చీకటిగా చూపించారు. హాలీవుడ్ సినిమాల్లో కనిపించే ప్రపంచంలా లంకను చూపించారు తప్ప, పురాణాల్లో చెప్పినట్టు చూపించలేదు. రావణుడి వాహనాన్ని కూడా మార్చేశారు. ఓ పెద్ద గబ్బిలాన్ని రావణుడి వాహనంగా చూపించారు. వాల్మీకి రాసిన రామాయణాన్ని ఆధారంగా తీసుకొని సినిమా తీశామని చెప్పిన దర్శకుడు, రావణుడి వాహనం గబ్బిలమని ఎక్కడ చదివాడో అతడికే తెలియాలి. దీనికితోడు రాముడు, సీత అనే సంభాషణలు పెట్టకుండా.. రాఘవ్, జానకి అని పెట్టడం.. లక్ష్మణుడి పాత్రకు శేషు అని, హనుమంతడి పాత్రకు భజరంగి అని పేర్లు మార్చడం పెద్దగా ఆకట్టుకోలేదు. పైగా, లంకకి వెళ్లేందుకు సేతు కట్టేటప్పుడు అన్ని చోట్లా ‘రామ’ అనే ఉంటుంది.

నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే.. రాముడిగా ప్రభాస్ సరిపోయాడు. కొన్నిచోట్ల శాంతంగా, మరికొన్నిచోట్ల రౌద్రంగా కనిపించి ఆకట్టుకున్నాడు. సీతగా కృతిసనన్ కు స్క్రీన్ టైమ్ తక్కువగానే ఉన్నప్పటికీ, తనవరకు ఆకట్టుకుంది. లక్ష్మణుడిగా సన్నీసింగ్, హనుమంతుడిగా దేవదత్తా మెప్పించారు.

ఇంతకుముందే చెప్పుకున్నట్టు దర్శకుడు ఓం రౌత్, ఈ సినిమాను రామాయణంగా కాకుండా, ఓ యాక్షన్ డ్రామాగా చూపించే ప్రయత్నం చేశాడు. మ్యూజిక్ డైరక్టర్స్ మాత్రం తమ వర్క్ తో ఆకట్టుకున్నారు. జై శ్రీరామ్ పాటను బాగా సింక్ చేశారు. అయితే క్లయిమాక్స్ లో మాత్రం హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల తరహాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. సినిమాటోగ్రఫీ బాగుంది.

ఓవరాల్ గా రామాయణాన్ని బేస్ చేసుకొని తీసిన ఆదిపురుష్ సినిమా రాముడి గొప్పదనం కంటే, రావణుడితో చేసిన యుద్ధాన్ని ఎక్కువగా చూపిస్తుంది. వీడియో గేమ్స్ ను పోలిన యుద్ధ సన్నివేశాలు, సెకండాఫ్ లో వచ్చిన గ్రాఫిక్స్ నప్పలేదు. ప్రభాస్ కోసం ఆదిపురుష్ ను ఓసారి చూడొచ్చు. అంతేతప్ప, రామాయణాన్ని వెండితెరపై చూసి తరిద్దామంటే మాత్రం కుదరదు.

రేటింగ్ – 2.75

By: ఎం. పట్నాయక్

TeluguCinema

TeluguCinema

  • News

Lenin: Second weekend is crucial for $1 million dream

Akhil Akkineni's Lenin has emerged as a profitable venture in North America by the end…

36 minutes
  • News

Dragon: NTR, Rukmini Vasanth shoot key sequences at RFC

The shooting of “Dragon,” the highly anticipated pan-India action drama starring NTR and directed by…

3 hours
  • News

Fauji forces rethink for Balakrishna’s NBK111 release?

The makers of Prabhas's Fauji have officially announced that the period action drama will hit…

4 hours
  • News

Actress Varalaxmi Sarathkumar calls Vijay’s rise to CM ‘destiny’

Actress Varalaxmi Sarathkumar recently met Tamil Nadu Chief Minister Vijay and shared pictures from the…

13 hours
  • News

AP Governor Abdul Nazeer calls on Pawan Kalyan after shoulder surgery

Andhra Pradesh Deputy Chief Minister and actor Pawan Kalyan is recovering at his Hyderabad residence…

14 hours
  • News

Is Sreeleela on a spree of losing big projects in Tamil and Telugu?

Sreeleela appears to be going through a difficult phase in her career, with reports suggesting…

15 hours