అలియా భట్ నటించిన పలు పెద్ద సినిమాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి. అందులో సంజయ్ లీలా భన్సాలీ తీసిన ‘గంగూబాయి’ మెయిన్. ఆమె రాజమౌళి తీసిన ‘ఆర్ ఆర్ ఆర్’లో కూడా నటించింది కానీ ఆమె ఎక్కువ ఆశలు పెట్టుకున్నది మాత్రం ‘గంగూబాయి’పైనే.
ఈ సినిమాలో ఆమెది టైటిల్ రోల్. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ఇది. ఈ సినిమా విజయం మొత్తం ఆమెపైనే ఆధారపడి ఉంది. ఆమె స్టార్డంకి పరీక్ష.
అందుకే, ఈ సినిమా ప్రొమోషన్ ని సీరియస్ గా తీసుకొంది. సోషల్ మీడియాని, మీడియాని ఉపయోగించుకొని హైప్ తెచ్చే ప్రయత్నం చేస్తోంది. బాలీవుడ్ లో ఇటీవల ఒక్క అక్షయ్ కుమార్ సినిమా మినహా ఏది థియేటర్లలో ఆడలేదు. అలియా భట్ మరి జనాలను థియేటర్లవైపు తీసుకొస్తుందా అన్నది చూడాలి.
మరోవైపు ఆమె తెలుగులో మరోసారి కనిపించనుంది. ఇప్పటికే ‘ఆర్ ఆర్ ఆర్’లో నటించింది. త్వరలోనే ఎన్టీఆర్ సరసన నటించనుంది. దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ తో తీసే కొత్త సినిమాలో మెయిన్ హీరోయిన్ అలియా భట్.
With premiere shows of “Peddi” set to begin across Andhra Pradesh and Telangana from 8…
Bollywood star Ranveer Singh no longer faces a non-cooperation directive from FWICE (Federation of Western…
One of the more surprising rumors currently doing the rounds in Film Nagar is that…
Kriti Sanon has become the talk of the town following the launch of the trailer…
After predominantly starring in mass entertainers and action dramas in recent years, Ravi Teja is…
Prabhas is currently busy shooting for Spirit, directed by Sandeep Reddy Vanga. The film is…