అల్లు అర్జున్ సినిమా డైలాగుల్లో “తగ్గేదే లే” అనేది బాగా పాపులర్ అయింది. దేశమంతా ఈ డైలాగ్ (హిందీలో జుకేగా నహీ సాలా), మేనరిజం వైరల్ అయిన విషయం మనకి తెలుసు. సినిమాల్లో ఉన్న యాటిట్యూడ్ నే కొన్నాళ్ళూ నిజజీవితంలో చూపించాడు అల్లు అర్జున్. “పుష్ప 2” భారీ విజయంతో తనకు ఎదురులేదు అనుకొని నేల విడిచి సాము చేశాడు.
రేవంత్ రెడ్డి మొదట బన్నీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడంతో ఒక్కసారిగా తగ్గిపోయాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అల్లు అర్జున్ తో పాటు అల్లు అర్జున్ వాళ్ళ నాన్న అల్లు అరవింద్ కూడా నేల మీదకు వచ్చారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ఉన్న రాజకీయ పలుకుబడి, క్రేజ్ చూసి మొత్తంగా “తగ్గిపోయాను లే” అంటున్నాడు.
ఇటీవల అల్లు అర్జున్ అమ్మమ్మ కనకరత్నం చనిపోయారు. ఆ సందర్భంగా తమ ఇంటికి వచ్చిన రామ్ చరణ్ తో అల్లు అర్జున్ ప్రవర్తన, అలాగే నిన్న ఇంటికి వచ్చి పరామర్శించిన పవన్ కళ్యాణ్ తో అల్లు అర్జున్ “వినయ విధేయ రామ” విధానంతో అందరూ బన్నీ “తగ్గాడు లే” అని కామెంట్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ కోటరీ, అతని భజనతోనే పైకొచ్చిన నిర్మాతలు, అలాగే అల్లు అర్జున్ అభిమానులు కూడా ఇప్పుడు ట్యూన్ మార్చారు. మెగా కుటుంబం అంతా ఒకటే, వాళ్ళ కుటుంబం అద్భుతం అన్నట్లు పోస్టులు పెడుతున్నారు. సీన్ కి తగ్గట్లు ట్యూన్ అన్నమాట.
The shooting of “Dragon,” the highly anticipated pan-India action drama starring NTR and directed by…
The makers of Prabhas's Fauji have officially announced that the period action drama will hit…
Actress Varalaxmi Sarathkumar recently met Tamil Nadu Chief Minister Vijay and shared pictures from the…
Andhra Pradesh Deputy Chief Minister and actor Pawan Kalyan is recovering at his Hyderabad residence…
Sreeleela appears to be going through a difficult phase in her career, with reports suggesting…
Director Sai Rajesh has once again addressed the casting change in Chennai Love Story, indirectly…