దీపిక, శృతి హాసన్, శ్రద్ద కపూర్, కృతి సనన్, ప్రశాంత్ నీల్, ఓం రౌత్… ఇలా ఎందరో సెలెబ్రిటీలు ప్రభాస్ అతిథ్యానికి ఫిదా అయ్యారు. ప్రభాస్ ప్రత్యేకంగా ఇంట్లో చేయించే వంటకాల రుచి చూసి అద్భుతం అంటూ ఆ ఘుమఘుమల ఫోటోలు, వీడియోలు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇప్పుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ వంతు.
అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం హైద్రాబాద్ లో ‘ప్రాజెక్ట్ కే’ ‘Project K’ షూటింగ్ లో పాల్గొంటున్నారు. అమితాబ్, ప్రభాస్ లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. అమితాబ్ కోసం ప్రభాస్ ప్రత్యేకంగా వంటలు చేయించి వడ్డిస్తున్నారట. అలాగే, కొన్ని కూకీస్ కూడా ఇచ్చారట. అవి రుచి చూసి అమితాబ్ కూడా ప్రభాస్ ని తెగ పొగిడేస్తున్నారు.
ఐతే, బిగ్ బి పూర్తిగా శాకాహారి. ప్రభాస్ సాధారణంగా మాంసాహార వంటకాలు ఎక్కువగా చేయిస్తుంటారు. భీమవరం రొయ్యలు, పీతలు, హైదరాబాద్ మటన్ బిర్యానీ తన అతిథులకు వడ్డిస్తుంటారు. కానీ, అమితాబ్ కోసం ఆయన అభిరుచికి తగ్గట్లు ప్రత్యేక శాకాహార వంటకాలు చేయించారట.
‘ప్రాజెక్ట్ కే’ ‘Project K’ ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. అమితాబ్, ప్రభాస్, దీపిక పదుకొనె ప్రధాన పాత్రల్లో కనిపించే ఈ భారీ సినిమా రెండేళ్లలో థియేటర్లల్లో విడుదల కానుంది.
The makers of Srinivasa Mangapuram have unveiled the film's theatrical trailer, offering a glimpse into…
Actress Rashmika Mandanna has offered fans an exciting behind-the-scenes glimpse from the sets of “Ranabaali,”…
Idupu Kayitham, starring Priyadarshi in the lead role, is gearing up for a theatrical release…
Actor and Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan is recovering after undergoing a successful…
Netflix's Telugu original series "Super Subbu," starring Sundeep Kishan in the lead role, premiered about…
After rewriting box office records in India and North America, Bollywood blockbuster “Dhurandhar” made its…