డింపుల్ హయతి. ఈ పేరు చాలా మందికి తెలియదు. కానీ డింపుల్ ఇప్పుడు తెగ అవకాశాలు లాగేసుకుంటోంది. ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో స్పెషల్ సాంగ్ తో పాపులర్ అయింది. అంతకుముందే ‘యురేకా’, ‘గల్ఫ్’ వంటి చిన్న తెలుగు చిత్రాల్లో నటించింది. ఐతే, ‘గద్దలకొండ గణేష్’లో ‘జరా జరా’ అనే పాటతో దర్శక, నిర్మాతలని ఆకర్షించింది.
ప్రస్తుతం… రవితేజ హీరోగా రూపొందుతోన్న ‘ఖిలాడీ’ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు. ఒక భామ.. డింపుల్ హయతి. లేటెస్ట్ గా తమిళంలో విశాల్ సరసన ఆఫర్ పొందింది.
విశాల్ హీరోగా రూపొందుతోన్న 31వ చిత్రం ఈ రోజు ప్రారంభమైంది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ డింపుల్ హయతి అని మేకర్స్ ప్రకటించారు. అంటే… ఈ భామ వరుసగా ఆఫర్లు అందుకొంటోంది. అన్నట్లు , రాజమౌళి తీస్తున్న “ఆర్ ఆర్ ఆర్” చిత్రంలో కూడా ఒక చిన్న పాత్ర పోషిస్తోంది. అందాలు అరబోయడంలో అస్సలు మొహమాటపడదు. డ్యాన్స్ కూడా ఇరగదీస్తోంది. ఇవి డింపుల్ కి అడ్వాంటేజ్.
The makers of “Aakasamlo Oka Tara” marked Dulquer Salmaan's birthday by releasing the film's first…
Actor Allu Arjun met hundreds of his fans at the annual gathering of the Allu…
View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) The success celebrations of…
Action sequences often come at a physical cost, and Telugu cinema's biggest stars know that…
Veteran filmmaker M. S. Raju says his upcoming thriller “Agadha” is one of the most…
Landing a role alongside Megastar Chiranjeevi is a dream opportunity for many actresses, and Ashika…