రేపే “అఖండ 2” ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాపై ఉన్న అంచనాలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. “అఖండ” బ్రాండ్ ఈ సినిమాపై హైప్ రావడానికి ఒక కారణం అయితే బాలయ్య, బోయపాటి కాంబినేషన్ కావడం మరోటి. వీరిద్దరి కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన “సింహా”, “లెజెండ్,” “అఖండ” భారీ విజయాలు సాధించాయి. నాలుగో చిత్రం కూడా పెద్ద హిట్ అవుతుంది అని బాలయ్య ధీమాగా చెప్తున్నారు.
“అఖండ 2″కి తెలుగులో ఓపెనింగ్స్ అదిరిపోతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అమెరికా, ఆస్ట్రేలియా ఇలా అన్ని చోట్లా భారీగా కలెక్షన్లు ఉంటాయి. అందులో సందేహం లేదు. కాకపోతే, హిందీలో ఈ సినిమాకి ఎలాంటి ఓపెనింగ్ వస్తుంది అనేది చూడాలి. హిందీ మార్కెట్ పై మొదటిసారిగా బాలకృష్ణ ఫోకస్ పెట్టారు.
“అఖండ” మొదటి భాగం హాట్ స్టార్ లో స్ట్రీమ్ అయినప్పుడు హిందీ వెర్షన్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో, “అఖండ 2″కి థియేటర్ లో కూడా క్రేజ్ ఉంటుంది అని హిందీలో డబ్ చేసి భారీగా రిలీజ్ చేస్తున్నారు. బాలయ్య కూడా కొంత ప్రమోషన్ చేశారు హిందీ వెర్షన్ కోసం.
అంతే కాదు, హిందీ వెర్షన్ బాగా ఆడితే అదనపు అమౌంట్ ఇస్తామని నెట్ ఫ్లిక్స్ “ఇన్సెంటివ్ మోడ్”లో ఒప్పందం చేసుకొంది. అంటే హిందీలో బాగా ఆడడం ముఖ్యం. సో, “అఖండ 2″కి వరకు తెలుగుతో పాటు హిందీ కూడా ఇంపార్టెంట్. ఈ సినిమాకి నార్త్ ఇండియాలో ఎలాంటి ఓపెనింగ్ వస్తుంది అనేది ట్రేడ్ అంతా చూస్తోంది.
Tamil superstar Vijay's final film as an actor, Jana Nayagan, is officially set to release…
Samantha Ruth Prabhu is taking time to relax and recharge before stepping into motherhood. The…
Unexpected twists centered around the protagonist have become a noticeable trend in Telugu cinema. Recent…
Priyanka Chopra has shared fresh details about SS Rajamouli's highly anticipated film "Varanasi" during her…
Reports about Malayalam filmmaker Basil Joseph directing Allu Arjun have been circulating for more than…
Among Telugu stars, NTR and Allu Arjun have recently been the subject of speculation over…