జాన్వీ…దాంట్లో…దీంట్లో!

టాలీవుడ్ కి జాన్వీ కపూర్ జ్వరం పెట్టుకొంది. అందరూ ఆమె పేరు పలవరిస్తున్నారు. దాంట్లో ఉంది… దీంట్లో ఉంది… అంటూ మీడియా కూడా ఆమె పేరుని లాగుతోంది. త్వరలో ప్రారంభం కానున్న పలు తెలుగు సినిమాల్లో ఆమె పేరు వినిపిస్తోంది.

ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమాలో ఆమె హీరోయిన్ గా తెలుగుతెరకు పరిచయం అవుతున్న విషయం మనకు తెలుసు. ఐతే, ఈ సినిమా కన్నా ముందే విజయ్ దేవరకొండ సరసన ఒక సినిమాలో, రామ్ చరణ్ – బుచ్చిబాబు సినిమాలో కూడా ఆమెని అనుకున్నారు. ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు ఆమెని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నట్లు టాక్. రామ్ చరణ్ సరసన పీరియడ్ చిత్రంలో ఆమె నటించే అవకాశం ఉంది. ఎప్పుడు డేట్స్ కావాలి అనే విషయంలో క్లారిటీ వస్తే ఆమె ఒప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఐతే, ఆమె సైన్ చెయ్యలేదు.

ఇక, ఇటీవలే ‘ఏజెంట్’తో దారుణమైన ఫ్లాప్ అందుకున్న అఖిల్ నెక్స్ట్ సినిమాకి క్రేజ్ రావాలంటే బాగా క్రేజ్ ఉన్న హీరోయిన్ కావాలి. జాన్వీ కపూర్ ఐతే బాగుంటుంది కదా అని సోషల్ మీడియాలో ఉన్న అభిమానుల ఆలోచన. ఐతే, సోషల్ మీడియాలో అభిమానులు కోరగానే నిర్మాతలు ఆమెని తీసుకోరు.

ఆమెని ఒప్పించాలంటే సినిమాకి 4 నుంచి 5 కోట్లు ఇవ్వాలి. ఇప్పటికే అఖిల్ సినిమాకి థియేటర్ల నుంచి 15 కోట్ల రెవెన్యూ రావడం లేదు. మరి అలాంటపుడు అంత అమౌంట్ ఇచ్చి ఆమెని తీసుకుంటారా?

మొత్తమ్మీద, జాన్వీ కపూర్ తదుపరి తెలుగు సినిమాలు ఏంటనే విషయంలో మీడియా, సోషల్ మీడియాలో హడావిడి ఉంది. కానీ ఆమె మాత్రం ఎంటర్ సినిమా తప్ప మరోటి సైన్ చెయ్యలేదు.

TeluguCinema

TeluguCinema

  • News

Ram Charan to undergo minor surgery, take three-month break

"Peddi" is nearing the completion of its first week in theaters. As the film continues…

2 hours
  • News

Veteran director Bharathiraja passes away

Veteran Tamil filmmaker Bharathiraja passed away in Chennai on Wednesday after battling age-related health issues.…

4 hours
  • News

North America BO: Peddi joins $3 million club

Ram Charan's "Peddi" has crossed a significant milestone in North America, becoming one of the…

16 hours
  • News

Mrunal Thakur, Pooja Hegde face setback in Bollywood again

Mrunal Thakur and Pooja Hegde's latest Bollywood release, "Hai Jawani Toh Ishq Hona Hai", has…

17 hours
  • News

Madhavan: I have never cheated on my wife

Actor Madhavan has said that he has remained faithful to his wife throughout their marriage,…

18 hours
  • News

Dragon to head to Sri Lanka for a major action episode

The makers of "Dragon", starring NTR and directed by Prashanth Neel, are gearing up for…

21 hours