ఇళయరాజా వల్లే కెరీర్ పోయిందట

ఏ.ఆర్.రెహ్మాన్ మొదటి చిత్రం… రోజా. ఆ సినిమాలోని ‘చిన్ని చిన్ని ఆశ’ పాట దేశమంతా ఊపేసింది. ఆ పాట పాడిన గాయని… మిన్మిని. ఐతే, ఆ సినిమా, ఆ పాట అంత పెద్ద హిట్ అయినా తన కెరీర్ మాత్రం ఎదగలేదు అని చెప్పారు ఆమె. దానికి కారణం మేస్ట్రో ఇళయరాజా అని అంటున్నారు ఆమె.

మిన్మిని చాలా కాలం రాజా దగ్గర కోరస్ గాయనిగా ఉన్నారు. ఐతే, రెహ్మాన్ అవకాశం ఇవ్వడంతో ఆమెకి పేరు వచ్చింది. తన దగ్గరే పాడాలని తెలిసి కూడా వేరే సంగీత దర్శకుడి దగ్గర ఎలా పాటలు పడతావు అని ఇళయరాజా స్టూడియోలో అందరూ ముందు నిలదీసారని ఆమె చెప్పారు. ఆ సంఘటనతో ఇళయరాజా తనకు స్టూడియోలోకి రానివ్వలేదని చెప్పారు.

ఒక గొప్ప సంగీత దర్శకుడి గురించి చెడుగా చెప్పితే తనని మరింతగా తొక్కేస్తారని అప్పటి నుంచి మౌనంగా ఉన్నాను అని ఆమె ఇటీవల ఒక టీవీ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఆ తర్వాత అనారోగ్యం వల్ల గొంతు పోవడం, దాంతో కొన్నేళ్లు పాటలు పాడలేదు అని మిన్మిని వివరించారు. మళ్ళీ రెహ్మాన్ పిలిచి ఆమెకి అవకాశాలు ఇచ్చారట.

ఇళయరాజా గొప్ప సంగీత దర్శకుడే కానీ ఆయనలో ఈ గుణం, ఈ కోణం కూడా ఉందని మిన్మిని చెప్పారు.

TeluguCinema

TeluguCinema

  • News

Fauji forces rethink for Balakrishna’s NBK111 release?

The makers of Prabhas's Fauji have officially announced that the period action drama will hit…

38 minutes
  • News

Actress Varalaxmi Sarathkumar calls Vijay’s rise to CM ‘destiny’

Actress Varalaxmi Sarathkumar recently met Tamil Nadu Chief Minister Vijay and shared pictures from the…

10 hours
  • News

AP Governor Abdul Nazeer calls on Pawan Kalyan after shoulder surgery

Andhra Pradesh Deputy Chief Minister and actor Pawan Kalyan is recovering at his Hyderabad residence…

11 hours
  • News

Is Sreeleela on a spree of losing big projects in Tamil and Telugu?

Sreeleela appears to be going through a difficult phase in her career, with reports suggesting…

12 hours
  • News

Sai Rajesh explains why Vaishnavi Chaitanya was replaced

Director Sai Rajesh has once again addressed the casting change in Chennai Love Story, indirectly…

12 hours
  • News

Korean Kanakaraju: Varun Tej does mass dance number with Daksha Nagarkar

Daksha Nagarkar appears in another mass number in Telugu cinema. The makers of Varun Tej's…

12 hours