రాధేశ్యామ్ షూటింగ్ ఇంకా అయిపోలేదా?


‘రాధే శ్యామ్’ షూటింగ్ పూర్తి అయింది అని పోయిన నెలలో దర్శకుడు ట్వీట్ చేశాడు. ప్రభాస్, ఆ సినిమా టీం షూటింగ్ పూర్తి అయినందుకు పార్టీ చేసుకున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వచ్చాయి. గుమ్మడికాయ కొట్టిన తర్వాత మళ్ళీ ఈ సినిమా కోసం సెట్స్ వేస్తున్నారట. అన్నపూర్ణలో సెట్స్ వేసి రెడీగా ఉంచారు. ప్రభాస్, పూజ హెగ్డేలపై తీస్తారు ఈ పాటని.

ఇంతకీ మేటర్ ఏంటంటే… ఒక ”సాంగ్” చిత్రీకరణ మిగిలి ఉందట. నిజానికి ఈ పాట తీసేందుకు యూరోప్ వెళ్ళింది టీం. అక్కడ హీరోయిన్ పూజ హెగ్డే, సినిమాలో కీలకమైన వ్యక్తికీ మధ్య భేదాభిప్రాయాల వల్ల షూటింగ్ రద్దు అయింది. ఇక ఆ పాటని తీయొద్దులే అని ప్రభాస్ టీంకి చెప్పాడట. కానీ ఈ సినిమా హిందీ హక్కులు కొన్న T Series సంస్థ ఆ పాట తీయాలని పట్టుబట్టింది. దాంతో మళ్లీ దాన్నీ హైదరాబాద్ లో సెట్ వేసి తీస్తున్నారు.

అందుకే, షూటింగ్ పూర్తి అయిపోయిందని చెప్పిన తర్వాత మళ్లీ షూటింగ్ చేస్తున్నారు. నాలుగేళ్లుగా సాగుతోంది ఈ సినిమా చిత్రీకరణ. జనవరి 14, 2022న విడుదల కానుంది ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ మొదటి పాట త్వరలోనే యూట్యూబ్ లో విడుదల కానుంది.

TeluguCinema

TeluguCinema

  • News

Love, action drive ‘Srinivasa Mangapuram’ trailer

The makers of Srinivasa Mangapuram have unveiled the film's theatrical trailer, offering a glimpse into…

9 hours
  • News

Ranabaali: Rashmika shares working still, says She can’t wait to watch it

Actress Rashmika Mandanna has offered fans an exciting behind-the-scenes glimpse from the sets of “Ranabaali,”…

10 hours
  • News

Priyadarshi’s ‘Idupu Kayitham’ eyes December 2026 release

Idupu Kayitham, starring Priyadarshi in the lead role, is gearing up for a theatrical release…

10 hours
  • News

AP CM Chandrababu Naidu visits Pawan Kalyan after shoulder surgery

Actor and Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan is recovering after undergoing a successful…

12 hours
  • OTT

Sundeep Kishan’s Netflix ‘Super Subbu’ struggles to get online chatter

Netflix's Telugu original series "Super Subbu," starring Sundeep Kishan in the lead role, premiered about…

15 hours
  • News

Dhurandhar fails to make impressive debut in Japan

After rewriting box office records in India and North America, Bollywood blockbuster “Dhurandhar” made its…

15 hours