ఈ ఏడాది ఎక్కువ సినిమాలు చెయ్యాలనుకున్నాడు రామ్. ‘రెడ్’ సినిమా విడుదలైన తర్వాత రామ్ ని పలువురు నిర్మాతలు, దర్శకులు కలిశారు. అందులో మూడు సినిమాలు ఓకే చేశాడు. తన బర్త్ డే (మే 15న) నాడు రెండు సినిమాలు అనౌన్స్ చేద్దామనుకున్నాడు రామ్ పోతినేని. కానీ కరోనా రెండో వేవ్ అతని ప్లాన్ మార్చేలా చేసింది.
ముందుగా లింగుస్వామి సినిమా పట్టాలెక్కితే చాలు అనుకుంటున్నాడు. ఎందుకంటే.. వచ్చే ఏడాది వరకు అనిశ్చితి ఉంటుంది. మార్కెట్ మళ్ళీ పుంజుకోవాలి. ఆగిపోయిన సినిమాలన్నింటికీ డేట్స్ దొరకాలి. ఒక్కసారి సినిమా విడుదలలు మొదలైతే, అన్ని సినిమాలు రిలీజ్ డేట్స్ విషయంలో కుస్తీ పడుతాయి. సో… ఈ టైంలో ఎక్కువ సీనిమాలు ఒప్పుకోవడం రిస్క్. రెండు మూడు సినిమాలు చేసిన నాని వంటి వారు కూడా వాటిని ఎప్పుడు రిలీజ్ చెయ్యాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే రామ్.. మిగతా రెండు సినిమాలను హోల్డ్ లో పెట్టాడట. జులై నుంచి లింగుస్వామి డైరెక్షన్లో సినిమా స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమాని లాంచ్ చేశారు.
A unique combination has come together for the first time in director Anil Ravipudi's next…
"Maa Inti Bangaram," starring Samantha, is set for a strong opening in North America. Marking…
NTR and director Prashanth Neel have joined forces for the high-budget action spectacle "Dragon." After…
The makers of "Peddi" have responded to criticism surrounding the portrayal of Janhvi Kapoor's character…
The much-awaited collaboration between Sharwanand, director Srinu Vaitla, and producer Anil Sunkara of AK Entertainments…
Samantha today met Tamil Nadu Chief Minister Joseph Vijay and congratulated him on his recent…