“భోళా శంకర్” సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలుగా నటించేందుకు మొదట అనుకున్న పేరు సాయి పల్లవి. ఆమెని టీం వెళ్లి అడిగింది. కానీ, ఆమె నో చెప్పింది. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు.
“లవ్ స్టోరీ” సినిమా ఫంక్షన్ లో సాయి పల్లవి డ్యాన్స్ గురించి చిరంజీవి పొగిడారు. నా సినిమాలో చెయ్యమని అడిగితే ఈ అమ్మాయి నో చెప్పింది అని చిరంజీవి స్టేజ్ పైనే చెప్పారు. దానికి స్పందించిన సాయి పల్లవి రీమేక్ సినిమాల్లో నటించకూడదనేది తన పాలసీ అని అందుకే చిరంజీవిగారితో నటించే గొప్ప అవకాశం వచ్చినా కాదనుకున్నాను అని తెలిపింది.
ఆ తర్వాత ఆ పాత్రని కీర్తి సురేష్ దక్కించుకొంది. ఇప్పుడు “భోళా శంకర్” విడుదలైంది. ఢమాల్ అనిపించుకొంది. ఈ సినిమాలో నటించిన కీర్తికి కూడా పేరు రాలేదు. మంచి పారితోషికం, మెగాస్టార్ తో నటించాను అన్న తృప్తి మినహా కీర్తికి ఈ సినిమా ఏమి ఉపయోగపడలేదు. దాంతో, ఈ పాత్రని వదులుకున్న సాయి పల్లవిని ఇప్పుడు మెచ్చుకుంటున్నారు.
సాయి పల్లవి ఎంత డబ్బు ఇస్తాము అని చెప్పినా తనకు నచ్చనిది చెయ్యదు.
The makers of Srinivasa Mangapuram have unveiled the film's theatrical trailer, offering a glimpse into…
Actress Rashmika Mandanna has offered fans an exciting behind-the-scenes glimpse from the sets of “Ranabaali,”…
Idupu Kayitham, starring Priyadarshi in the lead role, is gearing up for a theatrical release…
Actor and Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan is recovering after undergoing a successful…
Netflix's Telugu original series "Super Subbu," starring Sundeep Kishan in the lead role, premiered about…
After rewriting box office records in India and North America, Bollywood blockbuster “Dhurandhar” made its…