హీరోయిన్ గా మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది శ్రియ. ఈ ఏడాది ఆమె రెండు సినిమాల్లో అజయ్ దేవగన్ కి భార్యగా నటించింది. రెండు భారీ విజయాలు అందుకొంది. ఒకటి ‘ఆర్ ఆర్ ఆర్’, రెండోది ‘దృశ్యం 2’. దాంతో, ఈ భామ తెగ ఇంటర్వ్యూలు ఇస్తోంది.
ఆమె భర్త ఆండ్రీ రష్యాకి చెందిన వాడు. ఆయన శ్రియకి పబ్లిక్ గా తెగ ముద్దులు ఇస్తుంటాడు. ఇది ట్రోలర్స్ కి నచ్చట్లేదు. ఈ విషయంలో ఆమెని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఐతే, ఆమె భర్త ఈ విషయంలో ట్రోలింగ్ కన్నా మరో విషయంలో ఎక్కువ బాధపడుతుంటాడట.
“మేం పెళ్లి చేసుకున్న తర్వాత నేను కొన్ని నెలల పాటు ఆయన ఫోటోలు షేర్ చెయ్యలేదు. ఆ తెల్లోడిని ఎందుకు చేసుకున్నావు. ఇండియాలో ఎవరూ దొరకలేదా అని కామెంట్స్ పెట్టేవారు అప్పట్లో. అవి చదివి మా ఆయన బాగా నొచ్చుకున్నారు,” అని చెప్పింది .
ALSO CHECK: Shriya at IFFI Goa closing ceremony
40 ఏళ్ల శ్రియకి ఇటీవలే కూతురు పుట్టింది.
After the first song "Tabaahi," gained popularity, the makers of "Toxic: A Fairy Tale for…
NTR's heartfelt message wishing Nandamuri Balakrishna a speedy recovery has delighted Nandamuri fans and quickly…
Nandamuri Balakrishna sustained a minor knee injury while filming an action sequence for his upcoming…
SS Rajamouli's ambitious globe-trotting adventure “Varanasi,” starring Mahesh Babu and Priyanka Chopra, is progressing at…
Mamitha Baiju became a popular name after the blockbuster success of “Premalu.” Her popularity grew…
Sreeleela began her acting career at a very young age, making her screen debut while…