శృతి హాసన్ కి పెళ్లి గురించి టాపిక్ ఎత్తితే కోపం వస్తుంది. డేటింగ్ చేస్తాను కానీ పెళ్లి చేసుకోను అని గతంలో చెప్పింది శృతి. ఇప్పటికీ అదే పాలసీ పాటిస్తోంది. 35 ఏళ్ల శృతి ఇప్పుడు శాంతను హజారికా అనే ఆర్టిస్ట్ తో సహజీవనం చేస్తోంది. కానీ అతన్ని పెళ్లి చేసుకుంటారా? ముహూర్తం ఎప్పుడు వంటి ప్రశ్నలు అభిమానులు సంధిస్తే గయ్యిమని ఎగురుతోంది.
తాజాగా శృతి హాసన్ తన అభిమానులతో ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ చాట్ చేసింది. వారు అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఓపిగ్గా, డిటైల్డ్ గా సమాధానం ఇచ్చింది. కానీ, పెళ్లి ఎప్పో (ఎప్పుడు?) అని ఒక తమిళ అభిమాని అడిగితే ఘాటుగా రిప్లై ఇచ్చింది.
“ఇలాంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించకు బుర్ర పాడుచేసుకోకు. నా పెళ్లి గురించి ఊహే వద్దు,” అంటూ సమాధానం ఇచ్చింది. ఆమెకి పెళ్లి మీద మనసు పోవడం లేదు అనేది క్లారిటీగా అర్థం అవుతోంది. ఇటీవలే ఆమె ముంబైలో సొంత ఇల్లు కొనుక్కొంది. ఆ ఇంట్లోనే కొత్త బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉంటోంది.
ప్రస్తుతం ఆమె తెలుగులో ప్రభాస్ సరసన ‘సలార్’ మూవీ చేస్తోంది.
Kriti Sanon's acting journey began in Telugu cinema with “1: Nenokkadine,” starring Mahesh Babu and…
Telugu cinema’s leading star NTR's office has issued an official statement distancing the actor from…
Kajal Aggarwal has played several glamorous roles during the peak of her career. She also…
Actress Preity Mukhundhan has opened up about the one quality she values the most in…
Music director Anirudh Ravichander and businesswoman Kavya Maran are once again at the center of…
Nagarjuna Akkineni is now set to turn his full attention to his landmark 100th film…