ఐటెంగాళ్ కి 190 కోట్ల ఇల్లా?


పెద్ద హీరోయిన్లు కూడా 100 కోట్ల రూపాయలు సంపాదించలేరు. దీపిక పదుకోన్ లాంటి వాళ్ళు తప్ప మిగతా హీరోయిన్లకు 100 కోట్ల ఆస్తులు కూడబెట్టడం అసాధ్యం. ఇక ఐటెం సాంగ్ లు మాత్రమే చేసే భామలకు 100 కోట్ల రూపాయల దాచుకోవడం అనేది కేవలం కలల్లో మాత్రమే సాధ్యం.

కానీ, ఊర్వశి రౌటేలా ఏకంగా 190 కోట్ల రూపాయలు పెట్టి ఒక బంగ్లా కొని సంచలనం సృష్టించింది. ఈ వార్త వైరల్ అయింది. అంతేకాదు అందరికి షాక్ ఇచ్చింది ఈ వార్త.

ఊర్వశి ఇప్పటివరకు 15 సినిమాల్లో నటించింది. హిందీ, తెలుగు, తమిళ, బెంగాలీ భాషల్లో ఆమె చేసిన చిత్రాల సంఖ్య ఇది. ఇందులో ఆమె హీరోయిన్ గా నటించిన చిత్రాలు కేవలం ఐదు. మిగతావన్నీ ఐటెంసాంగ్స్ మాత్రమే. తెలుగులో ‘వాల్తేర్ వీరయ్య’లో “బాస్ పార్టీ’ అనే సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవితో స్టెప్పులేసింది. ఆ తర్వాత ఇటీవల విడుదలైన ‘ఏజెంట్’ చిత్రంలో అఖిల్ అక్కినేనితో “వైల్డ్ సాలా” అంటూ హంగామా చేసింది కానీ ఎవరూ పట్టించుకోలేదు.

కానీ, ఎన్ని ఐటెం సాంగ్స్ చేసినా దాదాపు 190 కోట్లు పెట్టి ఇల్లు కొనే సంపాదన రాదు. కేవలం 15 సినిమాల్లో కనిపించిన ఈ బ్యూటీ ముంబైలో అంత పెద్ద బంగ్లా ఎలా కొన్నది? ఇదే అందరిలో కలుగుతున్న ప్రశ్న. నిజంగా ఆమె చెప్తున్న అమౌంట్ నిజమేనా?

ఈ భామ తాజాగా బోయపాటి – రామ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రంలో కూడా ఐటెం గాళ్ గా కనిపించనుంది.

TeluguCinema

TeluguCinema

  • News

Rukmini Vasanth reveals her current obsessions: Idly, Pachinko and Olivia Dean

Rukmini Vasanth is enjoying a dream run in her career. After landing a string of…

52 minutes
  • News

Senior actress Tabu plays negative role in Nagarjuna’s 100th film?

Nagarjuna's landmark 100th film is currently in production. Directed by Tamil filmmaker R. Karthik, the…

1 hour
  • News

Christopher Nolan’s ‘The Odyssey’ wins early rave reviews

Ahead of its worldwide theatrical release, Christopher Nolan's "The Odyssey" has already generated tremendous buzz…

2 hours
  • News

Prabhas puts rumors to rest, prioritizes existing film lineup

Speculation surrounding Prabhas's future lineup refuses to die down. Almost every month, reports emerge claiming…

2 hours
  • News

Sandeep Reddy Vanga presents Romanchakam; release date locked

The makers of "Romanchakam", presented by blockbuster director Sandeep Reddy Vanga, have announced that the…

15 hours
  • News

Producer Naga Vamsi: I won’t stay silent forever

Producer Naga Vamsi has finally addressed the recent controversy involving producer, distributor, and multiplex chain…

15 hours