కొత్త జంట ఆనందంలో ఉంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి 2016 నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు. జూన్ 9న వీరి నిశ్చితార్ధం జరిగింది. ఇక ఇప్పుడు టైం తీసుకొని అందరికి థాంక్స్ చెప్పారు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం రోజు సెలెబ్రిటీలు సోషల్ మీడియాని శుభాకాంక్షలతో నింపేశారు. ఫ్యాన్స్, మూవీ లవర్స్ కూడా బెస్ట్ విషెస్ చెప్పారు. ఇప్పుడు వారి అందరికీ ఈ జంట జంటగా థాంక్స్ చెప్పింది. ఇద్దరూ ఒకే ఫోటో షేర్ చేశారు. థాంక్స్ చెప్పిన లైన్స్ కూడా సేమ్. “Thanks to each and everyone for the warm wishes,” అని ధన్యవాదాలు తెలిపారు.
వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి ముహూర్తం ఇంకా ఖరారు కాలేదు. ఐతే, యూరోప్ లో వీరి పెళ్లి జరగనుందని టాక్. ఒక మంచి రిసార్ట్ కోసం వెతుకుతున్నారు.
మరోవైపు, వరుణ్ తేజ్ ప్రస్తుతం సోని సంస్థ తీస్తున్న సినిమాలో నటిస్తున్నారు. ఇక లావణ్య త్రిపాఠి కూడా తన నటన ఆపలేదు. ఆమె కూడా వెబ్ సిరీస్ లు, వెబ్ మూవీస్ షూటింగ్ లతో బిజీగా ఉంది.
Akhil Akkineni's Lenin has emerged as a profitable venture in North America by the end…
The shooting of “Dragon,” the highly anticipated pan-India action drama starring NTR and directed by…
The makers of Prabhas's Fauji have officially announced that the period action drama will hit…
Actress Varalaxmi Sarathkumar recently met Tamil Nadu Chief Minister Vijay and shared pictures from the…
Andhra Pradesh Deputy Chief Minister and actor Pawan Kalyan is recovering at his Hyderabad residence…
Sreeleela appears to be going through a difficult phase in her career, with reports suggesting…