సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నారు. సినిమా పేరు…వారణాసి (Varanasi). ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అవుతుంది. కానీ మరో రెండు మూడు నెలల్లోనే షూటింగ్ భాగం పూర్తి అవుతుంది అని అంటున్నారు. అందుకే, మహేష్ బాబు ఆ తర్వాత చెయ్యబోయే సినిమాల గురించి చర్చ మొదలైంది.
ఇటీవల పెద్ది సినిమా తీసిన దర్శకుడు బుచ్చిబాబు ఒక కథ సిద్ధం చేశాడని, అది మహేష్ బాబుకి చెప్పబోతున్నాడు అని ప్రచారం జరిగింది. ఐతే, అదే ప్రశ్న ఆ దర్శకుడికి మీడియా వేస్తే, అది పెద్దలు నిర్ణయిస్తారు అని సమాధానం ఇచ్చాడు. పెద్దలు అంటే నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్. మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు వీళ్ళు. ఈ బ్యానర్ త్వరలోనే మహేష్ బాబుతో ఒక సినిమా ప్లాన్ చేస్తోంది.
“వారణాసి” తర్వాత మహేష్ బాబుతో తమ సంస్థే సినిమా తీయాలనేది మైత్రి భావన. ఐతే, దర్శకుల విషయంలోనే చర్చలు జరుగుతున్నాయి. “పెద్ది” దర్శకుడు మాత్రం మహేష్ బాబు లైన్లో లేడు అని అంటున్నారు.
బుచ్చిబాబు, మహేష్ బాబు కాంబినేషన్లో మూవీ జరగదు అని సన్నిహితులు తేల్చి చెప్తున్నారు. సో, నిర్మాతలు ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్ వంటి పెద్ద దర్శకులతో చర్చలు జరుపుతున్నారు.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…