అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక శోభిత మీనింగ్ వేరే ఉంది.
ఓ ఈవెంట్ లో పాల్గొన్న శోభిత, మీడియాతో మాట్లాడింది. అక్కినేని కుటుంబంలో అమలతో పాటు అందరికీ సినీ అనుభవం ఉంది కదా, మరి కథలు అంగీకరించేటప్పుడు వాళ్ల అనుమతి తీసుకుంటారా అనేది మీడియా ప్రశ్న. ఈ క్వశ్చన్ కు సూటిగా సమాధానమిచ్చింది శోభిత.
తన వద్దకు వచ్చే కథల్ని తనే విని, నచ్చితే ఓకే చేస్తానని, తన కుటుంబంలో ఎవ్వరికీ కథలు చెప్పి ఒపీనియన్ అడగనని అంటోంది. ఈ విషయంలో అక్కినేని అప్రూవల్స్ తను కోరుకోవడం లేదని, మనసుకు నచ్చిన కథలతోనే ముందుకెళ్తున్నానని చెప్పుకొచ్చింది.
భర్త నాగచైతన్య కూడా ఈ విషయంలో తనకు ఎలాంటి కండిషన్లు పెట్టడని, తను కూడా చైతూ చేసే ప్రాజెక్టుల గురించి పెద్దగా చర్చించనని అంటోంది శోభిత. కెరీర్ లో తనదైన శైలిలో దూసుకుపోతోంది శోభిత. సినిమాల కంటే ఓటీటీ ప్రాజెక్టులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది.
నాగ చైతన్య, శోభిత 2024 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. ఏడాదిన్నర అయింది వీరి పెళ్లయి. ఈ టైంలో ఆమె ఒక్క తెలుగు సినిమా కూడా ఒప్పుకోలేదు. కానీ తమిళంలో ఒక సినిమా అంగీకరించింది.
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…