శ్రీలీల ఈ ఏడాది ఒక పరీక్ష ఎదుర్కొంది. ఆమె నటించిన మొదటి తమిళ చిత్రం ఈ పొంగల్ సీజన్ లో విడుదలైంది. అలా ఆమెకి మొదటి పరీక్ష జరిగింది. ఈ పరీక్షలో ఆమె పాస్ అయి ఫెయిల్ అయింది.
ఆమె నటించిన మొదటి తమిళ చిత్రం… పరాశక్తి. హీరోగా శివకార్తికేయన్ నటించాడు. సినిమా విడుదలైంది అపజయం పాలు అయింది. జీవా హీరోగా నటించిన ఒక చిత్రం హిట్ కాగా శివకార్తికేయన్ “పరాశక్తి” ఫ్లాప్ అయింది. ఆ విధంగా శ్రీలీలకి మొదటి తమిళ చిత్రం నెగెటివ్ రిజల్ట్ తెచ్చింది. అంటే పరీక్షలో ఫెయిల్ అయినట్లే.
కానీ ఈ సినిమాలో ఆమె చేసిన పాత్రకు, ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఇప్పటివరకు మంచి డ్యాన్సర్, మంచి గ్లామర్ భామ అన్న పేరు మాత్రమే వచ్చింది. మొదటిసారి ఆమెకి నటిగా పేరు వచ్చింది. ఆ విధంగా పాస్ అయింది.
ALSO READ: Sreeleela feels Desi vibes
ఇక ఇప్పుడు మరో పరీక్ష. ఆమె నటించిన మొదటి బాలీవుడ్ చిత్రం కూడా ఈ ఏడాదే విడుదల కానుంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న అనురాగ్ బసు చిత్రంలో ఆమె హీరోయిన్ గా బాలీవుడ్ కి పరిచయం అవుతోంది. ఈ సినిమా నిజానికి గతేడాదే విడుదల కావాలి. కానీ కథలో మార్పులు చెయ్యాలి అని విడుదలని ఈ ఏడాదికి మార్చారు. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తారు. అలా ఆమెకి ఈ ఏడాది రెండో పరీక్ష ఎదురుకానుంది.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…