రీఎంట్రీలో త్రిష మరోసారి హీరోలందర్నీ కవర్ చేసేస్తోంది. అప్పుడెప్పుడో నటించిన స్టార్స్ అందరితో ఇప్పుడు మరోసారి సెకెండ్ రౌండ్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఇప్పటికే విజయ్, చిరంజీవి లాంటి స్టార్స్ ను కవర్ చేస్తున్న త్రిష.. ఇప్పుడు సూర్యతో సినిమా చేయబోతోంది.
సూర్య-త్రిషది సూపర్ హిట్ కాంబినేషన్. అయితే అదంతా ఒకప్పుడు. వీళ్లిద్దరూ కలిసి నటించి దాదాపు 18 ఏళ్లు అవుతోంది. మళ్లీ ఇన్నేళ్లకు ఇద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది.
కెరీర్ లో సూర్యకు ఇది 45వ చిత్రం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఈ ప్రాజెక్టుకు ఏఆర్ రెహ్మాన్ ను సంగీత దర్శకుడిగా అనుకుంటున్నారు.
దశాబ్దానికి పైగా కెరీర్ కొనసాగిస్తున్న త్రిష, ఇప్పుడు మరోసారి స్టార్ హీరోలందరితో సినిమాలు చేయడం చెప్పుకోదగ్గ విశేషం. విజయ్ తో ఆల్రెడీ ఆమె ‘లియో’ సినిమా చేసింది. కమల్ హాసన్ తో ‘థగ్ లైఫ్’ చేస్తోంది. చిరంజీవితో ‘విశ్వంభర’ మూవీలో నటిస్తోంది. ఇప్పుడు సూర్యతో సినిమాకు రెడీ అవుతోంది.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…