ఈ వీకెండ్ ఒకేసారి 10 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. గురువారం, శుక్రవారం ఈ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ఒక రీ-రిలీజ్ కూడా ఉంది. ఆ సినిమాలేంటో చూద్దాం.
ఈ వారాంతం రిలీజ్ అవుతున్న సినిమాల్లో ప్రధానంగా 4 సినిమాలు ఆకర్షిస్తున్నాయి. వీటిలో ఒకటి “బడ్డీ” సినిమా కాగా, రెండోది “శివంభజే.” అల్లు శిరీష్ హీరోగా నటించిన సినిమా “బడ్డీ”. ఇక అశ్విన్ బాబు హీరోగా చేసిన మూవీ “శివం భజే.” ఈ రెండు సినిమాలకు భారీగా ప్రచారం చేస్తున్నారు. బడ్డీకి టికెట్ రేట్లు కూడా తగ్గించారు. “శివం భజే” ఆగస్ట్ 1న విడుదల అవుతోంది. మిగతావన్నీ ఆగస్టు 2న వస్తున్నాయి.
అలాగే రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా జంటగా దర్శకుడు చౌదరి తీసిన “తిరగబడరా సామి” కూడా ఈ వీకెండ్ విడుదల అవుతోంది. ఈ హీరో, హీరోయిన్లు ఇద్దరూ వివాదాల్లో ఉన్నారు. ఈ వివాదం సినిమాకి ఓపెనింగ్స్ తెస్తుందా అనేది చూడాలి.
ఈ మూవీస్ తో పాటు “ఉషాపరిణయం” అనే మరో చిన్న సినిమా కూడా ఆకర్షిస్తోంది. సీనియర్ దర్శకుడు విజయ్ భాస్కర్, తన కొడుకును హీరోగా పెట్టి ఈ సినిమా తీశాడు. మెగా హీరో సాయిధరమ్ తేజ్ ను ఈ సినిమా కోసం రంగంలోకి దించాడు. అలా ఈ 4 సినిమాలు ఆకర్షిస్తున్నాయి.
ఇక విజయ్ ఆంటోనీ చేసిన “తుఫాన్” సినిమా కూడా 2వ తేదీనే థియేటర్లలోకి వస్తోంది. వరుణ్ సందేశ్ నటించిన “విరాజీ” సినిమా ఎలాంటి ప్రమోషన్ లేకుండా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలతో పాటు.. “అలనాటి రామచంద్రుడు”, “యావరేజ్ స్టూడెంట్ నాని”, “లారి” సినిమాలు మార్కెట్లోకి వస్తున్నాయి.
ఇక రీ-రిలీజెస్ విషయానికొస్తే.. ఈ వీకెండ్ నాని-సమంత హీరోహీరోయిన్లుగా నటించిన “ఎటో వెళ్లిపోయింది మనసు” సినిమా థియేటర్లలోకి వస్తోంది. వీటిలో ఏ సినిమా క్లిక్ అవుతుందో చూడాలి.
జగపతి బాబు (Jagapathi Babu) హీరోగా ఎంత సక్సెస్ అయ్యారో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా అంతే…
కంగన రనౌత్ (Kangana Ranaut) మన దేశంలో పనిచేస్తున్న నర్సుల దుస్తులపై విమర్శలు చేసింది. బ్రిటిష్ కాలంలో నర్సులకు ఈ…
ఓవైపు జాన్వి కపూర్ ను అసభ్యంగా చూపించారని, సౌత్ సినిమాలో ఇలాంటివి కామన్ అంటూ ట్రోలింగ్ నడుస్తున్న వేళ.. దక్షిణాది…
'పెద్ది' (Peddi) సినిమా వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఇందులో హీరోయిన్ జాన్వి కపూర్ (Janhvi Kapoor)ను అక్కడక్కడ అభ్యంతరకరంగా…
ఒకే సినిమాతో హీరోకి, హీరోయిన్ కి విషమ పరీక్ష ఎదురుకావడం అరుదు. "లెనిన్" (Lenin) సినిమా విషయంలో అదే జరుగుతోంది.…
ఒకప్పుడు తన స్పెషల్ సాంగ్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్‌లతో కుర్రకారును ఉర్రూతలూగించిన ముమైత్ ఖాన్ (Mumait Khan), ఒకప్పుడు తన జీవితంలోని…