ఒకే సినిమాతో హీరోకి, హీరోయిన్ కి విషమ పరీక్ష ఎదురుకావడం అరుదు. “లెనిన్” (Lenin) సినిమా విషయంలో అదే జరుగుతోంది.
ఈ సినిమాలో హీరోగా అఖిల్ అక్కినేని (Akhil Akkineni) నటించారు. హీరోయిన్ గా నటించిన భామ.. భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse). ఇద్దరికీ ఇప్పటివరకు హిట్ లేదు మరి.
అఖిల్ అక్కినేని నాగార్జున అక్కినేని కుమారుడిగా, ఒకప్పుడు బాలనటుడిగా అదరగొట్టిన వాడిగా భారీ అంచనాలతో ఎంట్రీ ఇచ్చాడు. వినాయక్ తీసిన “అఖిల్” అతని మొదటి చిత్రం. సినిమా దారుణ పరాజయం పాలు అయింది. ఆ తర్వాత “హలొ” అనే సినిమా సో సో అనిపించుకుంది. “మిస్టర్ మజ్ను: అంటూ మూడో సినిమా చేస్తే అది ఆడలేదు. నాలుగో చిత్రం “మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్”తో కెరీర్ కాస్త గాడిలో పడింది. కానీ ఐదో చిత్రం… “ఏజెంట్”తో దెబ్బ గట్టిగా తగిలింది. రెండేళ్లు రెస్ట్ తీసుకొని ఇప్పుడు ఆరో చిత్రం “లెనిన్”తో మన ముందుకొస్తున్నాడు.
ఇక ముంబై ముద్దుగుమ్మ భాగ్యశ్రీ రవితేజ సరసన అరంగేట్రం చేసింది. “మిస్టర్ బచ్చన్” ఆమెకి మొదటి తెలుగు చిత్రం. సినిమా ఢమాల్. ఐతే ఈ భామ తన బ్యూటీ అప్పీల్ తో ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఒకేసారి నాలుగు సినిమాలు ఒప్పుకొంది. “కింగ్డమ్”, “కాంత”, “ఆంధ్రా కింగ్ తాలూకా” ఇలా అన్నీ ఫ్లాపులు చవిచూసింది.
ఇప్పుడు ఆమె తాజా చిత్రం “లెనిన్” ఈ నెల 26న వస్తోంది. సో, అటు ఆరో చిత్రంగా అఖిల్ కి, ఐదో చిత్రంగా భాగ్యశ్రీకి ఈ “లెనిన్” పెద్ద పరీక్ష
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…
రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) రిలీజ్…
పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…