న్యూస్

నాగవంశీకే డేట్ పాటించాలని చెప్పిన Akkineni Nagarjuna

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే నిర్మాత ఎవరైనా ఉన్నారు అంటే అది నాగవంశీ (Naga Vamsi). మ్యాడ్ 2 (Mad 2) వంటి చిన్న సినిమా విడుదల తేదీని కూడా మూడుసార్లు వాయిదా వేసిన నిర్మాత ఆయన. ప్రతి సినిమాకీ అనేకసార్లు డేట్ మార్చడం ఆయన పద్దతి.

అలాంటి నిర్మాతకు సీనియర్ హీరో నాగార్జున (Akkineni Nagarjuna) మన హాలీవుడ్ పద్దతిలో ఏడాది ముందే డేట్ ఫిక్స్ చేసి విడుదల చెయ్యాలి చెప్పడం విశేషం.

“లెనిన్” (Lenin) సినిమా సక్సెస్ ని పురస్కరించుకొని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను పిలిచి షీల్డ్స్ ఇచ్చారు. ఈ సినిమాని నాగార్జున, నాగవంశీ కలిసి నిర్మించారు. ఈ సినిమాని కూడా మూడో, నాలుగు సార్లు వాయిదా వేశారు.

ఒకప్పుడు మేం రిలీజ్ కంటే ఒక నెల ముందే పూర్తి కాపీని చూసేవాళ్లం. ఇప్పుడు అలా జరగడం లేదు.ది ఆడిస్సి వంటి హాలీవుడ్ సినిమాకి ఏడాది క్రితం రిలీజ్ డేట్ చెప్పి పక్కాగా మూడు నెలల ముందు నుంచే ప్రొమోషన్ చేసి విడుదల చేశారు. మనం కూడా అలా చెయ్యాలి,” అంటూ నాగార్జున నాగవంశీ వైపు చూస్తూ చెప్పారు.

హాలీవుడ్ సినిమాల పద్దతిలోనే నాగవంశీ ఇతర తెలుగు నిర్మాతలు ఏడాది ముందే రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. కాకపోతే, ఆ తర్వాత ఆరేడు నెలల నుంచి ఏడాదిపాటు వాయిదా వేస్తారు. ఆ పద్దతి మారట్లేదు.

TeluguCinema

Recent Posts

Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం

హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…

12 hours ago

పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni

రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…

1 day ago

Jana Nayagan: విజయ్ కోసం కఠినమైన రూల్స్

తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) రిలీజ్…

1 day ago

నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal

పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…

2 days ago

Bhagyashri Borse: ఒక్క విజయం 2 కోట్ల భాగ్యం

భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…

2 days ago

Prince Cecil: వైవాహిక బంధంలోకి మరో నటుడు

సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. బ్రహ్మచారి జీవితానికి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇదే బాటలో తాజాగా…

2 days ago