న్యూస్

Prince Cecil: వైవాహిక బంధంలోకి మరో నటుడు

సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. బ్రహ్మచారి జీవితానికి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇదే బాటలో తాజాగా టాలీవుడ్‌కు చెందిన యువ నటుడు ప్రిన్స్ (Prince Cecil)కూడా తన జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడు.

కేవలం హీరోగానే కాకుండా.. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు.. పెళ్లికి సిద్ధమయ్యాడు. సాయి మాచిరాజు (Sai Machiraju) అనే యువతితో ప్రిన్స్ నిశ్చితార్థం పూర్తయింది. ఈ విషయాన్ని ప్రిన్స్ స్వయంగా వెల్లడించాడు.

నిజానికి ఈ వేడుక గత నెలలోనే జరిగినట్టు తెలుస్తోంది. తాజాగా వీడియో రిలీజ్ చేసి నిర్థారించాడు ప్రిన్స్. వచ్చే నెలలో న్యూజిలాండ్ లో ఈ జంట పెళ్లి చేసుకుంటుందంట. ప్రిన్స్, సాయి మాచిరాజులకు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

‘బస్టాప్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రిన్స్. హీరోగా క్రేజ్ రాకపోవడంతో తక్కువ టైమ్ లోనే క్యారెక్టర్ రోల్స్ కు షిఫ్ట్ అయ్యాడు. ‘నేను శైలజ’ లాంటి సినిమాల్లో మంచి పాత్రలు పోషించాడు. సూపర్ హిట్టయిన ‘డీజే టిల్లూ’లో ప్రిన్స్ పోషించిన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

TeluguCinema

Recent Posts

నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal

పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…

10 hours ago

Bhagyashri Borse: ఒక్క విజయం 2 కోట్ల భాగ్యం

భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…

19 hours ago

Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది

నభా నటేష్ (Nabha Natesh) ఈ ఏడాది రెండు భారీ సినిమాలపై ఆశలు పెట్టుకొంది ఒకటి నాగబంధం (Nagabandham), మరోటి…

1 day ago

Sri Gouri Priya: తెలుగు భామకి తెలుగులో కెరీర్ ఊపు వచ్చేనా

శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు అమ్మాయి. ఇప్పటికే తెలుగులో 'మ్యాడ్' చిత్రంలో నటించింది. తమిళంలో…

1 day ago

Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?

తెలుగులో పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ ఉన్న భామ… రష్మిక మందాన (Rashmika Mandanna) మాత్రమే. బాలీవుడ్ లో  'యానిమల్',…

1 day ago

Varun Tej ఖాతాలోనే మారుతి తదుపరి చిత్రం

దర్శకుడు మారుతి (Maruthi) ఆ మధ్య తీసిన 'ది రాజా సాబ్' (The Raja Saab) సినిమా ఎంత ఘోరంగా…

1 day ago