
సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. బ్రహ్మచారి జీవితానికి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇదే బాటలో తాజాగా టాలీవుడ్‌కు చెందిన యువ నటుడు ప్రిన్స్ (Prince Cecil)కూడా తన జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడు.
కేవలం హీరోగానే కాకుండా.. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు.. పెళ్లికి సిద్ధమయ్యాడు. సాయి మాచిరాజు (Sai Machiraju) అనే యువతితో ప్రిన్స్ నిశ్చితార్థం పూర్తయింది. ఈ విషయాన్ని ప్రిన్స్ స్వయంగా వెల్లడించాడు.
నిజానికి ఈ వేడుక గత నెలలోనే జరిగినట్టు తెలుస్తోంది. తాజాగా వీడియో రిలీజ్ చేసి నిర్థారించాడు ప్రిన్స్. వచ్చే నెలలో న్యూజిలాండ్ లో ఈ జంట పెళ్లి చేసుకుంటుందంట. ప్రిన్స్, సాయి మాచిరాజులకు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
‘బస్టాప్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రిన్స్. హీరోగా క్రేజ్ రాకపోవడంతో తక్కువ టైమ్ లోనే క్యారెక్టర్ రోల్స్ కు షిఫ్ట్ అయ్యాడు. ‘నేను శైలజ’ లాంటి సినిమాల్లో మంచి పాత్రలు పోషించాడు. సూపర్ హిట్టయిన ‘డీజే టిల్లూ’లో ప్రిన్స్ పోషించిన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
