
తెలుగులో “ఇడుపు కాయితం” (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga). ఈ సినిమా కోసం ఆమె దర్శకనిర్మాతలకు ఏకంగా 15 కండిషన్లు పెట్టింది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత బన్నీ వాస్ వెల్లడించాడు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మరిన్ని కండిషన్లు పెట్టింది ఈ నల్గొండ అమ్మాయి.
సినిమాల్లో తన పాత్రల ఎంపిక విషయంలో నాగదుర్గ చాలా క్లియర్ గా ఉంది. కేవలం గ్లామర్ కోసం తనను తీసుకొని, 2 పాటల్లో డ్యాన్స్ చేయించి పక్కన పెట్టేసే రొటీన్ పాత్రలకు తాను పూర్తిగా దూరమంటోంది. అలాంటి ఆలోచనతో ఎవరైనా ఉంటే తన దగ్గరకు రావొద్దని ముందే చెప్పేస్తోంది.
కేవలం డాన్స్ కోసం వాడుకొని, నటనకు ప్రాధాన్యం లేని గ్లామర్ బొమ్మలా స్క్రీన్‌పై కనిపించడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని నిర్మొహమాటంగా చెబుతోంది. కథలో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే ఆ ప్రాజెక్టుకు సైన్ చేస్తానని చెప్పుకొచ్చింది.
ఇంకా తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకుండానే, ఇలా వరుసపెట్టి షరతులు విధిస్తోంది నాగదుర్గ. ఐతే, ఆమె ఇప్పటికే తమిళంలో ఒక సినిమా చేస్తోంది. అంటే ‘ఇడుపు కాయితం’ ఆమెకి రెండో చిత్రం.
