Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Sanathana ట్రెండ్ తెలుగు సినిమాలకు కలిసి రావడం లేదా?

TeluguCinema, July 7, 2026July 7, 2026
Nagabandham, Akhanda 2 and Hari Hara Veera Mallu,

ఒకప్పుడు ఫ్యామిలీ డ్రామాలు, తర్వాత హారర్ కామెడీలు, ఆపై పాన్ ఇండియా యాక్షన్ చిత్రాలు… ఏ జానర్‌కు ఆదరణ లభిస్తే తెలుగు సినిమా పరిశ్రమ వెంటనే ఆ దిశగా అడుగులు వేస్తుంది. గత కొన్నేళ్లుగా మరో కొత్త ధోరణి కనిపిస్తోంది. అదే హిందూ పురాణాలు, ఆలయ రహస్యాలు, యోధుల గాథలు, “సనాతన ధర్మం” (Sanathana Dharma)వంటి అంశాలను ప్రధానంగా తీసుకుని పాన్ ఇండియా మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకోవడం.

తెలుగు ప్రేక్షకులతో పాటు భారీ హిందీ మార్కెట్‌ను ఆకర్షించాలనే ఉద్దేశంతో పలువురు దర్శకులు, నిర్మాతలు ఈ తరహా కథలను ఎంచుకుంటున్నారు. అయితే ఇటీవల విడుదలైన కొన్ని చిత్రాల ఫలితాలు చూస్తే ఈ ఫార్ములా ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది.

తాజాగా విడుదలైన “నాగబంధం” (Nagabandham) క్లైమాక్స్ మొత్తం సనాతన ధర్మం చుట్టూనే తిరుగుతుంది. భారీ విజువల్స్, గ్రాండ్ కాన్సెప్ట్ ఉన్నప్పటికీ సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. హిందీ మార్కెట్‌లో కూడా ఏ మాత్రం స్పందన రాలేదు.

ఇక “అఖండ 2” విషయంలో కూడా ఇదే జరిగింది. తొలి భాగం భక్తి, మాస్ ఎలిమెంట్స్, బాలకృష్ణ నటనతో ఘన విజయం సాధించింది. అయితే రెండో భాగంలో పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సనాతన ధర్మానికి సంబంధించిన ఎపిసోడ్లు, భారీ డైలాగులు, ప్రతీకాత్మక సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కానీ అవి ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. ఫలితంగా సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.

పవన్ కళ్యాణ్ నటించిన “హరిహర వీరమల్లు” కూడా ఇదే తరహా విమర్శలను ఎదుర్కొంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టారని పలువురు భావించారు. అయితే ఆ కాన్సెప్ట్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయింది. సినిమా కూడా వాణిజ్యపరంగా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.

మంచు విష్ణు నటించిన “కన్నప్ప” కూడా పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన భక్తి చిత్రం. శివభక్తుడు కన్నప్ప కథను ఆధారంగా తీసుకున్న ఈ చిత్రానికి భారీ స్థాయిలో ప్రచారం చేసినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. భక్తి కథలు తెలుగు ప్రేక్షకులకు కొత్తవి కావు. “అన్నమయ్య”, “శ్రీరామదాసు”, “శిర్డీ సాయి”, వంటి చిత్రాలు మంచి ఆదరణ పొందాయి. అంటే ప్రేక్షకులు భక్తి చిత్రాలను తిరస్కరిస్తున్నారనే కాదు.

సమస్య కథలో సహజంగా ఉండాల్సిన ఆధ్యాత్మిక అంశాలను పక్కనపెట్టి, పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఒక ప్రత్యేక సిద్ధాంతాన్ని లేదా సందేశాన్ని బలవంతంగా కథలో చొప్పిస్తున్నారనే భావన కలిగితే ప్రేక్షకులు దాన్ని స్వీకరించడం లేదనే విశ్లేషణ వినిపిస్తోంది. అంతిమంగా, సినిమా విజయాన్ని నిర్ణయించేది ఏ సిద్ధాంతం కాదు; బలమైన కథ, భావోద్వేగాలు, ఆకట్టుకునే పాత్రలు, నమ్మదగిన కథనం. భక్తి అయినా, పురాణం అయినా, చరిత్ర అయినా ప్రేక్షకుడు కోరేది మంచి సినిమా మాత్రమే. పాన్ ఇండియా మార్కెట్ కోసం అనవసరంగా “సనాతన ధర్మం” అంటూ అర్థంకానీ పద్దతిలో సీన్లు జొప్పించి తీస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి.

Post navigation

Previous post

ఇవీ చదవండి

  • Nagabandham, Akhanda 2 and Hari Hara Veera Mallu,
    Sanathana ట్రెండ్ తెలుగు సినిమాలకు కలిసి రావడం లేదా?
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఇన్ స్టాలో అందాల ఆరబోత, సినిమాల్లో నో గ్లామర్!
  • Aishwarya Rajesh
    ఆ మేజిక్ కోసం చూస్తానంటున్న Aishwarya Rajesh
  • Sreeleela
    అలాంటి వాడు దొరికితే రెడీ అంటోన్న Sreeleela
  • Shriya
    Shriya: హీరోయిన్ పై కామెంట్ చేస్తే థ్యాంక్స్ చెప్పిన భర్త
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: తొలి సినిమా నుంచి ఆ కథలే భాగ్యం
  • Malavika Mohanan
    మాల్దీవుల్లో Malavika Mohanan అందాల ఆరబోత
  • Neha Dhupia
    Neha Dhupia: ‘వెనకనుంచి తీయొద్దురా బాబు’, పాపరాజీపై మండిపాటు
  • Kayadu Lohar
    Kayadu Lohar: రాయితో బుర్ర పగలగొట్టిన హీరోయిన్
  • Pooja Hegde
    Pooja Hegde: పూజ పేరు ఇంకో భారీ ప్రాజెక్టులో!
  • Nabha Natesh
    నాగబంధంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను: Nabha Natesh
  • Sonakshi Sinha
    Sonakshi Sinha: అవకాశాలు తగ్గినా పర్లేదు!
  • Ram Charan
    Peddi: మిగతా అన్ని భాషల్లోనూ అట్టర్ ఫ్లాప్
  • Vaishnavi Chaitanya
    Sithara: జులై నుంచి అక్టోబర్, వరుసగా నాలుగు చిత్రాలు
  • Rhea Chakraborty
    Rhea Chakraborty: తోడు కావాలి కానీ ఇప్పుడు కాదు

Recent News

  • Sanathana ట్రెండ్ తెలుగు సినిమాలకు కలిసి రావడం లేదా?
  • RAPO23: రామ్ దర్శకత్వం, సామ్ సంగీతం
  • Mega158: భారీ ఫైట్స్ స్వయంగా చేస్తోన్న చిరంజీవి
  • కమల్ హాసన్ కి కూతురు Shruti Haasan సపోర్ట్
  • Kajal Aggarwal: ఇన్ స్టాలో అందాల ఆరబోత, సినిమాల్లో నో గ్లామర్!
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes