
కియరా అద్వానీ (Kiara Advani) గురించి ఆ మధ్య కొన్ని పుకార్లు వచ్చాయి. టాక్సిక్ (Toxic) సినిమా చూసిన తర్వాత అందులో కొన్ని సీన్లు చూసి ఆమె అభ్యంతరం చెప్పింది అనేది ఆ పుకార్ల సారాంశం. కియరా ఈ సినిమా ఒప్పుకునేముందు తల్లి కాలేదు. సినిమా పూర్తి అయ్యేసరికి ఆమె తల్లిగా మారింది. ఆమెకి ఒక పాప పుట్టింది.
ఒక తల్లిగా తాను ఇప్పుడు శృంగార సన్నివేశాల్లో కనిపిస్తే బాగోదు అని, కొన్ని రొమాంటిక్ సీన్లు మరీ హాట్ గా ఉన్నాయి అని ఆమె భావించిందట. ఆ విషయాన్నీ హీరో యష్ కి, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కి చెప్పి వాటిని తొలగించమని అడిగినట్లు వార్తలు వచ్చాయి.
ఐతే, కియరా ఆ పుకార్లు వచ్చినప్పుడే వాటిని తోసిపుచ్చింది. తాను నటించిన ఎలాంటి సీన్లు ఇబ్బంది కలిగించేలా లేవని, కాబట్టి వాటిని తీసెయ్యమని అడగలేదని చెప్పింది.
తాజాగా “టాక్సిక్” నుంచి మొదటి పాట వీడియో వచ్చింది. ఈ పాటలో యష్, ఆమె మధ్య సన్నివేశాలు చాలా హాట్ హాట్ గా ఉన్నాయి. దర్శకురాలు వీరిపై శృంగారకోణంలోనే చిత్రీకరించినట్లు కనిపిస్తోంది. పాట చూస్తే ఆమె సీన్లు తొలగించమని అడిగింది నిజం కాదనిపిస్తోంది. చాలా హాట్ సీన్స్ ఉన్నాయి మరి.
