
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది. ఇప్పుడు ‘లెనిన్’ (Lenin)పై స్పందించాడు ఈ దర్శకుడు. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో వచ్చిన ఈ రూరల్ ఎమోషనల్ డ్రామాపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం అవి నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఎప్పుడూ తనదైన శైలిలో స్పందించే ఆర్జీవీ, ఈసారి అఖిల్ నటనను ఆకాశానికెత్తేస్తూ సంచలన ట్వీట్ చేశారు.
తాను ఇప్పుడే ‘లెనిన్’ సినిమా చూశానని, చిత్రం చాలా అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు. అంతేకాకుండా, అక్కినేని ఫ్యామిలీ మొత్తంలోనే అఖిల్ బెస్ట్ యాక్టర్ అని తాను ఇప్పుడే గ్రహించానంటూ వర్మ పేర్కొనడం విశేషం. ఈ విషయాన్ని అఖిల్ తండ్రి నాగార్జునపై ఒట్టేసి మరీ చెబుతున్నానంటూ తన మార్క్ కామెంట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు.
సినిమాలో అఖిల్ చూపించిన ఈజ్, హావభావాలు అద్భుతంగా ఉన్నాయని ఆర్జీవీ కొనియాడారు. సాధారణ సన్నివేశాలలో ఎంతో సహజంగా నటిస్తూనే, ఎమోషనల్ సీన్స్ వచ్చేసరికి తన నటనతో అఖిల్ అదరగొట్టేశాడంటూ ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు.
ఇంతటి పవర్‌ఫుల్ పాత్రను డిజైన్ చేసి, అఖిల్ లోని అసలైన నటుడిని బయటకు తీసినందుకు చిత్ర దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరికి ఆర్జీవీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
