
నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన పారితోషికాన్ని తగ్గించాలన్న నిర్మాతల మాటకి నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే లే అని ఖరాకండిగా ఉంటోంది. .
ఇటీవల ఆమెకి ఒక పాన్ ఇండియా సినిమా ఆఫర్ వచ్చింది. కానీ ఆ సినిమాకి ఈ భామ నో చెప్పినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
“కేజీఎఫ్” సినిమాతో యష్ సరసన నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి ప్రస్తుతం తెలుగు చిత్రాలతో బిజీగా ఉంది. ఇటీవల సిద్ధు జొన్నలగడ్డతో “తెలుసుకదా”, నాని సరసన “హిట్ 3” చిత్రాల్లో నటించిన ఆమె ప్రస్తుతం వెంకటేష్‌తో కలిసి “ఆదర్శ కుటుంబం” (Aadarsha Kutumbam) లో నటిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం శ్రీనిధిని సంప్రదించిన నిర్మాతలు ఆమె రెమ్యునరేషన్ తగ్గించాలని కోరారట. అయితే, అందుకు ఆమె ససేమిరా చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన చేతిలో మంచి ప్రాజెక్టులు ఉన్నాయని, పారితోషికంలో రాజీ పడాల్సిన అవసరం లేదని నిర్మాతలకు శ్రీనిధి స్పష్టం చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
