
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తాజాగా ఆమె మాతృత్వం గురించి భావోద్వేగంగా స్పందించారు.
తాను తల్లి కావాలని చాలా ఏళ్లుగా కోరుకుంటున్నానని ఆమె తెలిపారు. మాతృత్వపు భావనను ఆనందంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
“ఇది చాలా భావోద్వేగాలతో కూడుకున్న దశ. ఈ అందమైన క్షణం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను. ఎప్పటినుంచో తల్లి కావాలని అనుకున్నాను. ఈ ప్రయాణంలో ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను,” అని సమంత పేర్కొన్నారు.
తాను చేసే ప్రతి పనిఇష్టపడి చేస్తానని ఆమె చెప్పారు. మాతృత్వానికి సిద్ధమవుతున్న ఈ దశలో తనలో కొత్త శక్తి, కొత్త ఉత్సాహం కనిపిస్తున్నాయని అన్నారు.
తన జీవితానికి కొత్త దిశ లభించిన భావన కలుగుతోందని ఆమె తెలిపారు.
సమంత ఇటీవలే ” మా ఇంటి బంగారం” (Maa Inti Bangaaram) సినిమాతో భారీ విజయం అందుకున్నారు. ఈ సినిమాకి రచయితగా, సహ నిర్మాతగా వ్యవహరించిన రాజ్ నిడిమోరుని ఆమె గత డిసెంబర్లో పెళ్లాడారు.
