
పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఫిట్ నెస్, గ్లామర్ మెయింటైన్ చేస్తోంది. దీనికి కారణం ఏంటి?
డెలివరీ తర్వాత శారీరకంగా, మానసికంగా మరింత దృఢంగా తయారవ్వాలని నిర్ణయించుకుంది కాజల్. అందుకే కష్టమైన గుర్రపు స్వారీ నేర్చుకుంది. కాస్త ఎక్కువగా శ్రమ పెట్టే జిమ్ వర్కవుట్స్ కూడా చేయడం మొదలుపెట్టింది. అలా కొన్ని నెలల్లోనే పాత ఫిజిక్ సంపాదించానంటోంది.
అయితే దీంతో పాటు ఆహారపు అలవాటు కూడా మార్చుకుందంట కాజల్. గతంలా కాకుండా, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత రోజుకు 5-6 సార్లు తినడం మొదలుపెట్టిందంట. తక్కువ పరిమాణంలో ఎక్కువసార్లు భోజనం చేయడం అన్నమాట. ఆ తినే ఆహారంలో కూడా ఆకుకూరలు, నట్స్, తాజా పండ్లు ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుందంట.
పెళ్లి తర్వాత రైస్ కు పూర్తిగా దూరమైంది కాజల్. దీంతో పాటు ప్రాసెస్డ్ ఫుడ్ కూడా తీసుకోవడం ఆపేసింది. ఇలా కఠినమైన ఆహార నియమాలు కూడా పాటించడంతో తన అందాన్ని మరింత మెరుగుపరుచుకుంది. ఆమె పూర్తి శాకాహారి అనే విషయం తెలిసిందే.
